హలో పోలీసులా.. నేను భార్యను చంపేశా: ఢిల్లీ వ్యక్తి షాకింగ్ ఫోన్ కాల్

Published : Nov 22, 2022, 08:28 PM IST
హలో పోలీసులా.. నేను భార్యను చంపేశా: ఢిల్లీ వ్యక్తి షాకింగ్ ఫోన్ కాల్

సారాంశం

ఢిల్లీ ఓ వ్యక్తి తన భార్యను గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి హత్యానేరాన్ని అంగీకరించాడు. పోలీసులు ఆ నిందితుడిని అరెస్టు చేశారు.  

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను చంపేసిన ఘటన చోటుచేసుకుంది. అప్పులకు సంబంధించి ఇరువురి మధ్యల జరిగిన ఘర్షణలో ఆయన తన భార్యను చంపేసినట్టు తెలుస్తున్నది. ఆ విషయాన్ని నేరుగా పోలీసులకు ఫోన్ చేసి తాను తన భార్యను చంపేసినట్టు సమాచారం ఇవ్వడం గమనార్హం.

ఆదివారం ఉదయం 8.10 గంటలకు ఢిల్లీలోని హర్ష విహార్ పోలీసు స్టేషన్‌కు ఒక కాల్ వెళ్లింది. యోగేశ్ కుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి పరిచయం చేసుకున్నాడు. తాను తన భార్యను చంపేశానని చెప్పాడు. ఉదయమే వచ్చిన ఆ ఫోన్‌లో ఒక వ్యక్తి హత్యానేరాన్ని అంగీకరిస్తాడని ఊహించలేదు. ఈ సమాచారం తెలియగానే పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే వారు సుశీల గార్డెన్‌లోని ఆ వ్యక్తి ఇంటికి వెళ్లారు. వారి నివాసంలో అర్చన ఫ్లోర్ పై అపస్మారకస్థితిలో పడి ఉన్నారు.

వెంటనే ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ, ఆమె అప్పటికే మరణించినట్టు వైద్యులు డిక్లేర్ చేశారు. ఢిల్లీ పోలీసులు 35 ఏళ్ల యోగేశ్ కుమార్‌ను అరెస్టు చేశారు. 

Also Read: భద్రాద్రి కొత్తగూడెం : వేట కొడవళ్లతో గుత్తికోయల దాడి.. ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు మృతి

ప్రాథమిక విచారణ ప్రకారం, వారి కుటుంబం ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్టు తెలిసింది. అర్చనా వేర్వేరు వ్యక్తుల నుంచి డబ్బును అప్పుగా తీసుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో ఆదివారం వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ జరుగుతుండగానే భార్య  అర్చనను యోగేశ్ కుమార్ గొంతు నులిమి చంపేశారు.

PREV
click me!

Recommended Stories

Sia Goyal Case: కేతన్ అగర్వాల్ హత్య జరిగిన స్పాట్ ఇదే సుమారు 400 అడుగుల ఎత్తు నుంచి | Asianet Telugu
చెన్నైలో చిన్నారులకు పోలియో వేసిన సీఎం విజయ్ | CM Vijay Launches National Pulse Polio