
Delhi: ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రుల్లో సరైన వైద్య సదుపాయాలు కల్పించడంలో విఫలమైందని, ప్రభుత్వ ఆసుపత్రులు రోగులను దోపిడీ చేస్తున్నాయని, వారికి సరైన వైద్యం అందించడం లేదని ఓ వ్యక్తి తన తల్లి శవాన్ని చూపిస్తూ.. ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఇందుకు సంబంధించిన ఓ వీడియోను నెటింట్లో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోను బీజేపీ ఢిల్లీ అధికార ప్రతినిధి నీతూ సింగ్ ఓ భయంకరమైన ఘటన అని వీడియోను షేర్ చేశారు.
సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉచిత వైద్య సేవల పేరుతో పౌరుల జీవితాలను నాశనం చేశారంటూ బీజేపీ ఢిల్లీ అధికార ప్రతినిధి నీతూ సింగ్ ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. “ఢిల్లీలోని సంజయ్ గాంధీ ఆసుపత్రిలో రోగులకు చికిత్స అందని పరిస్థితిని చూడండి. ఉచిత సేవల పేరుతో కేజ్రీవాల్ పౌరుల జీవితాలను నాశనం చేశారు’’ అని ట్వీట్ చేశారు.
ఆ వీడియోలో తన తల్లి మరణానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని బాధిత వ్యక్తి ఆరోపించారు. తల్లి చాలా అనారోగ్యంతో ఉందని, రక్తస్రావం అవుతుందని బుధవారం సాయంత్రం 4:30 గంటలకు మంగోల్‌పురిలోని సంజయ్ గాంధీ ఆసుపత్రికి తన తల్లిని తీసుకెళ్లాననీ, కానీ, అక్కడి వైద్యులు అడ్మిట్ చేసుకోవడానికి నిరాకరించారని, అందుకు బదులుగా.. కొన్ని మందులు వ్రాసి ఆసుపత్రి నుండి బయలుదేరమని చెప్పారని ఆరోపించారు.
గురువారం ఉదయం.. తన తల్లి పరిస్థితి విషమంగా ఉందనీ, మరోసారి రక్తపు వాంతులు చేసుకుందనీ, వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. నా తల్లి మరణానికి బాధ్యులెవరు? ఈ వైద్యుడిని సస్పెండ్ చేయాలి' అని వీడియోలో పేర్కొన్నాడు.
సాయంత్రం 4:30 గంటల తర్వాత రిజిస్టర్ చేసుకోవడానికి పేషెంట్ నిరాకరించినట్లు ప్రభుత్వ ఆధీనంలోని ఆసుపత్రి రుజువు చేసిందని వీడియోలో చూపించాడు. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన తల్లిని చంపిందని ఆరోపించారు. ఆసుపత్రిలో సరైన వైద్యం, మంచి సౌకర్యాలు లేవు. తన తల్లి మరణానికి ఎవరు బాధ్యత వహిస్తారు ? అని ప్రశ్నించాడు.
2020 ఢిల్లీ ఎన్నికల సందర్భంగా.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో సిఎం అరవింద్ కేజ్రీవాల్ పౌరులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తాననీ, మందులు ఉచితంగా అందిస్తామని హామీ ఇవ్వడం గమనార్హం. MRI, CT స్కాన్, అల్ట్రాసౌండ్, 25,000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చుతో కూడిన PET స్కాన్ సహా వైద్య పరీక్షలు కూడా ఉచితం అని ఆయన ప్రకటించారు. అలాగే, ఇటీవలి పంజాబ్ ఎన్నికల సందర్భంగా, పంజాబ్ రాష్ట్రంలో ఆప్ 'ఢిల్లీ మోడల్' ఆరోగ్య సంరక్షణను అమలు చేస్తుందని చెప్పారు.అయితే, ఢిల్లీలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందిస్తున్నప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రద్దీ ఎక్కువగా ఉండడంతో పౌరులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోతున్నారు.