ఢిల్లీ లిక్కర్ స్కామ్: మనీష్ సిసోడియాను రిమాండ్‌కు కోరిన సీబీఐ.. ఆర్డర్ రిజర్వ్ చేసిన కోర్టు..

Published : Feb 27, 2023, 04:43 PM ISTUpdated : Feb 27, 2023, 04:59 PM IST
ఢిల్లీ లిక్కర్ స్కామ్: మనీష్ సిసోడియాను రిమాండ్‌కు కోరిన సీబీఐ.. ఆర్డర్ రిజర్వ్ చేసిన కోర్టు..

సారాంశం

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఆదివారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు సిసోడియాను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన సీబీఐ అధికారులు.. ఆయనను ఐదు రోజుల పాటు రిమాండ్‌కు ఇవ్వాలని కోరారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఆదివారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు సిసోడియాను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన సీబీఐ అధికారులు.. ఆయనను ఐదు రోజుల పాటు రిమాండ్‌కు ఇవ్వాలని కోరారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ చాలా ప్రణాళిక బద్దంగా, రహస్యంగా కుట్ర పొందాని సీబీఐ కోర్టులో వాదనలు వినిపిచింది. ఇందులో మనీష్ సిసోడియాది కీలక పాత్ర అని కూడా తెలిపింది. ఈ కేసులో సమర్థవంతమైన విచారణ కోసం మనీష్ సిసోడియా కస్టడీ అవసరమని వాదించింది. ఈ కేసులో తన పాత్ర ఏమీ లేదని సిసోడియా పేర్కొన్నప్పటికీ.. ఆయన వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకున్నారని విచారణలో తేలిందని సీబీఐ కోర్టుకు తెలియజేసింది.

మరోవైపు మనీష్ సిసోడియాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మనీష్ సిసోడియా సెల్‌ఫోన్‌లు మార్చారని సీబీఐ చెబుతుందని.. అయితే అది నేరం కాదని అన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి కూడా సలహాలు తీసుకున్న తర్వాతే ఈ విధానాన్ని అమలు చేశామని.. దీనికి సంప్రదింపులు అవసరం కాబట్టి కుట్ర జరిగే అవకాశం లేదని న్యాయవాది చెప్పారు.

ఈ క్రమంలోనే ఇరుపక్షాల వాదనలు విన్న రౌజ్ అవెన్యూ కోర్టు.. మనీష్ సిసోడియా రిమాండ్‌ను కోరుతూ సీబీఐకి దాఖలు చేసిన అభ్యర్థనపై ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. అంతకుముందు.. సిసోడియాను సీబీఐ భారీ భద్రత మధ్య రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకువచ్చింది. రౌస్ అవెన్యూ కోర్టు ప్రాంగణంలో, వెలుపల భారీ భద్రత ఏర్పాటు చేయబడింది.

మనీష్ సిసోడియా అరెస్ట్ తర్వాత ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా సంగతి తెలిసిందే. ఢిల్లీలోని బీజేపీ, ఆప్ కేంద్ర కార్యాలయాల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఢిల్లీ పోలీసులు తమ పార్టీ ప్రధాన కార్యాలయంలోకి బలవంతంగా ప్రవేశించారని ఆప్ నేత ఆదిల్ ఖాన్ ఆరోపించారు. ‘‘ఢిల్లీలో ఎమర్జెన్సీ విధించారా? మీరు ఆప్ ప్రధాన కార్యాలయంలోకి ఎలా ప్రవేశించగలరు?’’అని ఆదిల్ ఖాన్ ప్రశ్నించారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?