మనీష్ సిసోడియాకు చుక్కెదురు:బెయిల్ పిటిషన్ తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు

By narsimha lodeFirst Published Jun 5, 2023, 2:22 PM IST
Highlights

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  న్యూఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం   మనీష్ సిసోడియాకు మధ్యంతర బెయిల్  పిటిషన్ ను   ఢిల్లీ హైకోర్టు  తిరస్కరించింది. 

న్యూఢిల్లీ:  ఆప్ నేత ,న్యూఢిల్లీ  మాజీ డిప్యూటీ సీఎం  మనీష్ సిసోడియా   బెయిల్ పిటిషన్ ను  ఢిల్లీ హైకోర్టు  సోమవారం నాడు తిరస్కరించింది.  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  మనీష్ సిసోడియా  నిందితుడిగా  ఉన్నారు.  తన భార్య  ఆరోగ్యం బాగా లేదని   బెయిల్ ఇవ్వాలని  మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ దాఖలు  చేశారు.  ఆరు వారాల బెయిల్ కోరుతూ   మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.  మనీష్ సిసోడియా  దాఖలు  చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ  హైకోర్టు  ఇవాళ   తిరస్కరించింది.

అయితే  ఉదయం  10 గంటల నుండి  సాయంత్రం  ఐదు గంల మధ్య  తన భార్యను  ఆమె సౌలభ్యం మేరకు  నివాసం లేదా  ఆసుపత్రిలో  కలుసుకునేందుకు  కోర్టు  అనుమతినిచ్చింది.మనీష్ సిసోడియాకు  తన భార్యను కలుసుకునేందుకు  కోర్టు  శనివారం నాడు  అనుమతిని  ఇచ్చింది.  అనారోగ్యంతో  ఉన్న  మనీష్ సిసోడియా  భార్య సీమా   సిసోడియా ను  లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రిలో  చేర్చారు.  తీహార్ జైలు  నుండి   మనీష్  సిసోడియా  వచ్చే సరికి  ఆమె  ఆసుపత్రిలో  చేరడంతో  ఆమెను కలవలేకపోయాడు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  సీబీఐ అధికారులు  ఈ ఏడాది  ఫిబ్రవరి 26న  మనీష్ సిసోడియాను  అరెస్ట్  చేశారు.  మరో వైపు  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఈడీ  అధికారులు  కూడా  మనీష్ సిసోడియాపై  కేసు నమోదు  చేశారు.   ప్రస్తుతం  తీహార్ జైలులో  మనీష్ సిసోడియా  ఉన్నారు.  ఆరు వారాల పాటు  మధ్యంతర బెయిల్ కోరుతూ  మనీష్ సిసోడియా దాఖలు  చేసిన పిటిషన్ ను  ఢిల్లీ హైకోర్టు  ఇవాళ  తిరస్కరించింది.

also read:ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియాకు చుక్కెదురు: బెయిల్ తిరస్కరించిన హైకోర్టు

దేశ వ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కాం  సంచలనం సృష్టించింది.  దక్షిణాదిలోని  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో  ఢిల్లీ లిక్కర్ స్కాం మూలాలున్నాయని  దర్యాప్తు  సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ దిశగా  దర్యాప్తు  చేస్తున్నాయి.  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఈడీ అరెస్ట్  చేసిన  శరత్ చంద్రారెడ్డి గత వారంలో  అఫ్రూవర్ గా మారేందుకు  సిద్దమయ్యాడు. ఈ మేరకు  ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు  చేశారు.


 

click me!