కాంగ్రెస్‌కు షాక్... బిజెపిలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు

By Arun Kumar PFirst Published Oct 16, 2018, 4:47 PM IST
Highlights

గోవా రాజకీయాల్లో మరోసారి అలజడి చెలరేగింది. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు సాధించినప్పటికి ప్రభుత్వాన్ని మాత్రం  ఏర్పాటు చేయలేకపోయింది. బిజెపి పార్టీ తక్కువ స్థానాలు సాధించినప్పటికి ఇతర పార్టీలతో కలిసి అధికారాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ బలాన్ని మరింత తగ్గించే పనిలో పడింది  బెజెపి అధిష్టానం. అందుకోసం ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. 

అయితే తాజాగా బిజెపి పార్టీ తమ ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోడానికి ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. ఇందులో భాగంగా ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బిజెపి పార్టీలోకి ఆహ్వానించింది. అత్యంత రహస్యంగా డిల్లీకి చేరుకున్న ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను వీడి బిజెపి జాతీయాద్యక్షుడు అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో భారీ ఎదురుదెబ్బ తగిలింది.

ఎమ్మెల్యేలు దయానంద్ సోప్టే, సుభాష్ శిరోద్కర్‌లు నిన్న రాత్రి హుటాహుటిన గోవా నుంచి ఢిల్లీకి బయల్దేరారు. అక్కడ అమిత్ షాను కలిసి బీజేపీలో చేరారు. అయితే అప్పటివరకు ఈ విషయం ఎవరికీ తెలియకుండా  ఎమ్మెల్యేలతో పాటు బిజెపి పార్టీ గోప్యంగా ఉంచింది. అమిత్ షా ను కలిసిన తర్వాతే ఎమ్మెల్యేలిద్దరు మీడియాతో మాట్లాడారు.

ఈ  సందర్భంగా వీరు సంచలన విషయాలను బైటపెట్టారు. మరికొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిజెపిలోకి జంప్ చేయడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే వారి చేరికలు ఉంటాయంటూ కాంగ్రెస్ కు మరో షాక్ ఇచ్చారు.  
 
click me!