నటి కారు వెంబడించి.. అసభ్య ప్రవర్తన

Published : Feb 04, 2021, 08:21 AM IST
నటి కారు వెంబడించి.. అసభ్య ప్రవర్తన

సారాంశం

ఆమెతో అసభ్య పదజాలంతో దూషిస్తూ.. వేధింపులకు గురిచేశారు. ఆమెను ఫాలో అయ్యి.. భయబ్రాంతులకు గురిచేశారు. దీంతో.. సదరు నటి పోలీసులను ఆశ్రయించింది. 

మద్యం మత్తులో కొందరు యువకులు దారుణంగా ప్రవర్తించారు. టీవీ నటి కారును వెంబడించి.. ఆమెతో అసభ్య పదజాలంతో దూషిస్తూ.. వేధింపులకు గురిచేశారు. ఆమెను ఫాలో అయ్యి.. భయబ్రాంతులకు గురిచేశారు. దీంతో.. సదరు నటి పోలీసులను ఆశ్రయించింది. దీంతో.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

టీవీ నటి ప్రాచీ తెహ్లాన్‌ బాస్కెట్‌ బాల్‌ ప్లేయర్‌ కూడా. మంగళవారం అర్ధరాత్రి భర్తతో కలిసి ఢిల్లీలో జరిగిన ఓ వేడుకకు వెళ్లింది. తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో నలుగురు వ్యక్తులు కారును వెంబడించారు. మధువన్‌ చౌక్‌కు చేరుకోగానే ఆ దుండగులు కారును దాటి రోడ్డుకు అడ్డంగా వారి వాహనాన్ని నిలబెట్టారని ప్రాచీ ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో దుండుగులను ఓవర్‌టేక్‌ చేసి ముందుకు వెళ్లామని ఆమె తెలిపారు. అయినా వారు తమను వెంబడించి వేధింపులకు దిగారని, తమ కాలనీ గేటు వరకూ తమను ఫాలో అయ్యారని చెప్పారు. ప్రశాంత్‌ విహార్‌లోని తాము ఇంటికి చేరుకోగానే వారు వాహనం నుంచి దిగి తనను, తన భర్తను అసభ్యంగా దూషిస్తూ బెదిరించారని, తమపై దాడికి పాల్పడ్డారని ఆమె తన భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆమె ఫిర్యాదుతో పోలీసులు స్పందించి ఘటనా స్ధలానికి చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిని ప్రస్తుతం విచారిస్తున్నారు. మద్యంమత్తులో వారు ఆ విధంగా చేశారని తెలుస్తోంది. కాగా ప్రాచీ తెహ్లాన్‌ భారత బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారిణి. గతంలో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. 2010లో కామన్‌వెల్త్‌ క్రీడా పోటీలకు ప్రాతినిథ్యం వహించింది. అనంతరం 2016లో టీవీ నటిగా మారింది. ‘దియా ఔర్‌ బాతీ హమ్‌’ అనే టీవీ షోతో గుర్తింపు పొందింది. 2017లో పంజాబీ సినిమా ‘అర్జన్‌’లో ప్రాచీ నటించింది.

PREV
click me!

Recommended Stories

Viral News: పెళ్లి రద్దుకు కారణమైన ప్రీ వెడ్డింగ్ షూట్.. అసలేం జరిగిందంటే.?
Droupadi Murmu Yoga: అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి ముర్ము| Asianet News Telugu