ఖైదీ నెం.8775 గా అచ్చెన్నాయుడు, జైల్లో ఏం తిన్నారంటే..

By telugu news teamFirst Published Feb 4, 2021, 8:00 AM IST
Highlights

జైలు జీవితం రెండు రోజులు గడిచింది. తొలి రోజైన మంగళవారం సాయంత్రం మూడు చపాతీలు, చిక్కుడుకాయల కూర తిని, రాత్రి 9.30 గంటలకు నిద్రపోయారు.

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నిమ్మాడలో ఇటీవల మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు అరెస్టు అయిన సంగతి తెలిసిందే. కాగా.. అనంతరం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఆయన శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలులోని జిల్లా జైలులో రిమాండ్ ఖైదీ నంబర్ 8775గా ఉన్నారు.

 జైలు జీవితం రెండు రోజులు గడిచింది. తొలి రోజైన మంగళవారం సాయంత్రం మూడు చపాతీలు, చిక్కుడుకాయల కూర తిని, రాత్రి 9.30 గంటలకు నిద్రపోయారు.


బుధవారం ఉదయం 5.30కి నిద్రలేచి టీ తీసుకున్నారు. జైలు సిబ్బంది తీసుకొచ్చిన సాక్షి, మరో పత్రికను చదివారు. ఉదయం 8.30కి పొంగలి తీసుకున్నారు. రిమాండ్‌ ఖైదీగా వచ్చినప్పుడు తీసుకెళ్లిన డ్రస్‌ను బుధవారం మార్చుకున్నారు. ఎవర్నీ కలవనియ్యవద్దని ఆయన సిబ్బందితో చెప్పారు. గురు, శుక్రవారాల్లో లోకేశ్, మరికొందరు అచ్చెన్నాయుడిని కలిసే అవకాశముందని పోలీసులకు సమాచారం వచ్చింది

కాగా.. నిమ్మాడ నుంచి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు భార్య సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆమెపై పోటీకి వైసీపీ నుంచి అచ్చెన్నాయుడుకు వరసకు అన్న కొడుకైన కింజారపు అప్పన్న బరిలోకి దిగారు. అప్పన్నతో నామినేషన్ వేయించడానికి టెక్కలి వైసీపీ కోఆర్డినేటర్ దువ్వాడ శ్రీను వెళ్లారు. వీళ్లిద్దర్ని అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్ అడ్డుకున్నారు

కాగా.. పంచాయతీ తొలివిడత నామినేషన్లలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య వివాదం జరిగింది. ఈ వివాదంపై కోటబొమ్మాళి పీఎస్‌లో 22 మందిపై కేసు నమోదు అయింది. ఈ క్రమంలోనే అచ్చెన్నాయుడిని కూడా అరెస్టు చేశారు. 

click me!