కోచింగ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం.. వైర్ల సాయంతో కిందకు దిగిన విద్యార్థులు.. (వీడియో)

Published : Jun 15, 2023, 02:11 PM IST
కోచింగ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం.. వైర్ల సాయంతో కిందకు దిగిన విద్యార్థులు.. (వీడియో)

సారాంశం

న్యూఢిల్లీలోని ముఖర్జీ నగర్‌లో గురువారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ముఖర్జీ నగర్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో మంటలు చెలరేగాయి.

న్యూఢిల్లీలోని ముఖర్జీ నగర్‌లో గురువారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ముఖర్జీ నగర్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రమాదం నుంచి బయటపడేందుకు పలువురు విద్యార్థులు పై అంతస్తుల్లోని కిటికీల నుంచి వైర్ల సపోర్టుతో కిందకు దిగడం కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 11 అగ్నిమాపక యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని.. ఇప్పటి వరకు ఎలాంటి గాయాలు కాలేదని అగ్నిమాపక అధికారులు తెలిపారు.

అగ్నిప్రమాదం గురించి మధ్యాహ్నం 12.27 గంటలకు కాల్ వచ్చిందని, మొత్తం 11 ఫైర్ టెండర్లను సేవలో ఉంచామని ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. అగ్నిమాపక శాఖ షేర్ చేసిన వీడియో.. ప్రజలు, ఎక్కువగా విద్యార్థులను అగ్నిమాపక సిబ్బంది కిటికీల ద్వారా రక్షించబడటం చూడవచ్చు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.

 


ఇక, ఉత్తర ఢిల్లీలో ఉన్న ముఖర్జీ నగర్ వివిధ కోచింగ్ సెంటర్‌లకు కేంద్రంగా ఉంది. ఇది విద్యా రంగానికి కేంద్రంగా పరిగణించబడుతుంది.

PREV
click me!

Recommended Stories

Special Trains for Sankranti Festival: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు| Asianet News Telugu
Real estate: నెల రోజుల్లో రూ. 20 ల‌క్ష‌ల లాభం.. అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ అంతలా ఎందుకు పెరుగుతోంది.?