Delhi excise policy case: ఈడీ, సీబీఐల తీరుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫైర్

By Mahesh RajamoniFirst Published Sep 16, 2022, 3:33 PM IST
Highlights

Delhi CM Arvind Kejriwal: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తాజా దాడుల మధ్య ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. ఈడీ, సీబీఐ 'అనవసరంగా అందరినీ ఇబ్బంది పెడుతున్నాయ‌ని అన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మనీ యాంగిల్‌పై దర్యాప్తులో ఈడీ పలు ప్రాంతాల్లో దాడులు చేయగా, స్కాం కేసు అసలు దేనికి సంబంధించినదో తనకు అర్థం కావడం లేదని కేజ్రీవాల్ అన్నారు.
 

Delhi excise policy case: ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసు విష‌యంలో రాజ‌కీయ ర‌చ్చ కొన‌సాగుతూనే ఉంది. ఈ స్కామ్ ప‌లు పార్టీల నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్ధానికి తెర‌లేపింది. ఈ క్ర‌మంలోనే ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తాజా దాడుల మధ్య ఢిల్లీ సీఎం  అర‌వింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. ఈడీ, సీబీఐ 'అనవసరంగా అందరినీ ఇబ్బంది పెడుతున్నాయ‌ని అన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మనీ యాంగిల్‌పై దర్యాప్తులో ఈడీ పలు ప్రాంతాల్లో దాడులు చేయగా, స్కాం కేసు అసలు దేనికి సంబంధించినదో తనకు అర్థం కావడం లేదని కేజ్రీవాల్ అన్నారు. కుంభకోణంలో లెఫ్టినెంట్ గవర్నర్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, బీజేపీలు విభిన్న రకాల స్వరాలు వినిపించడంపై ఆయన విమర్శలు గుప్పించారు. కేంద్ర ఏజెన్సీలు అందరినీ అనవసరంగా ఇబ్బంది పెడుతున్నాయ‌ని పేర్కొన్నారు.

శుక్ర‌వారం నాడు మీడియాతో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఈ స్కాం కేసు అసలు దేనికి సంబంధించినదో తనకు అర్థం కావడం లేదని అన్నారు. ఇప్పుడు ఉపసంహరించుకున్న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మనీలాండరింగ్ విచారణలో భాగంగా దేశవ్యాప్తంగా దాదాపు 40 ప్రాంతాల్లో ఈడీ తాజా దాడులు ప్రారంభించిన తర్వాత కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘వారి (బీజేపీ) నాయకుడు ఒకరు రూ. 8 వేల కోట్ల కుంభకోణం అనీ, ఎల్జీ రూ. 144 కోట్ల కుంభకోణం అనీ, సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో కోటి రూపాయ‌ల కుంభకోణం జరిగిందని చెబుతున్నారనీ.. ఇలా ఈ కుంభ‌కోణంపై వ్యాఖ్య‌లు చేయ‌డంతో త‌న‌కు ఏం అర్థం కావడం లేదు కేజ్రీవాల్ పేర్కొన్నారు. దేశం ఇలా పురోగమించదు.. కేంద్రంలోని వారు, ఏజెన్సీలు అనవసరంగా అందరినీ ఇబ్బంది పెడుతున్నాయ‌ని తెలిపారు. 

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు కొందరు బ్యూరోక్రాట్‌లను నిందితులుగా చేర్చిన సీబీఐ ఎఫ్‌ఐఆర్ తర్వాత ఈడీ ఈ కేసులో డబ్బు కోణంపై విచారణ ప్రారంభించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో, అమలు చేయడంలో అవకతవకలు జరిగాయా? అక్ర‌మ మార్గంలో డబ్బు చేతులు మారిందా? అనే కోణంలో ఈడీ విచార‌ణ జ‌రుపుతోంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ED శుక్రవారం భారతదేశంలోని దాదాపు 40 ప్రదేశాలలో తాజా దాడులు ప్రారంభించింది. నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని మరికొన్ని నగరాల్లోని మద్యం వ్యాపారులు, పంపిణీదారులు-ఇతర‌ సరఫరా గొలుసు నెట్‌వర్క్‌లకు సంబంధించిన ప్రాంగణాల్లో దాడులు నిర్వహిస్తున్నట్లు అధికారిక వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ పేర్కొంది. 

ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఆగస్టు 19న సిసోడియా నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో సీబీఐ దాడులు నిర్వహించింది. ఢిల్లీలో 16 కొత్త ల్యాండ్‌ఫిల్ సైట్‌లను రూపొందించాలనీ, దానిని చెత్త కొండల నగరంగా మార్చాలని బీజేపీ పాలిత ఎంసీడీ యోచిస్తోందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రస్తుతం, ఢిల్లీ సరిహద్దుల వద్ద మూడు పల్లపు ప్రదేశాలు ఉన్నాయి అవి ఘాజీపూర్, ఓఖ్లా, భల్స్వా అని తెలిపారు. "ఈ చెత్త కుప్పల నుండి వెలువడే దుర్వాసన-అనేక ఇతర సమస్యల వల్ల ఈ పల్లపు ప్రదేశాలకు సమీపంలో నివసించే ప్రజలు ప్రభావితమవుతున్నారు. దేశ రాజధానిలో 16 కొత్త చెత్త కొండలను రూపొందించే యోచనలో ఉన్నట్లు మేము విన్నాము" అని అన్నారు.

click me!