Delhi election Results: అయ్యా.. అయ్యా.. రాహుల్ గాంధీని వదిలేయండయ్యా.. అలా ఆడుకోవద్దు

Published : Feb 08, 2025, 02:17 PM IST
Delhi election Results: అయ్యా.. అయ్యా.. రాహుల్ గాంధీని వదిలేయండయ్యా.. అలా ఆడుకోవద్దు

సారాంశం

దిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది. ఈ ఢిల్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ జాతీయ పునరుజ్జీవనానికి దారి తీస్తాయని అంటుండగా.. సోషల్ మీడియాలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని మెమ్స్ తో ఆడుకుంటున్నారు.

న్యూఢిల్లీ:  దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భారీ ఆధిక్యం సంపాదించింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కొద్దిసేపు తేడాను తగ్గించగలిగినప్పటికీ తర్వాత వెనకబడింది.  ఇది మెజారిటీ మార్కు 36 కంటే చాలా తక్కువ. అదే సమయంలో, కాంగ్రెస్ (ఐఎన్‌సి) ఢిల్లీలో గత ఎన్నికల మాదిరిగానే ఖాతా తెరవలేకపోయింది. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న దేశ రాజధానిలో ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. 

ఎన్నికల ఫలితాలు బయటకు రాగానే, నెటిజన్లు యాక్షన్‌లోకి దిగారు కాంగ్రెస్ పార్టీ అనేక ట్రోల్స్‌కు గురైంది. X (గతంలో ట్విట్టర్ అని పిలుస్తారు)లో వైరల్ అవుతున్న కొన్ని మీమ్‌లను చూడండి.

హర్యానా మహారాష్ట్రలలో బీజేపీ గెలిచిన తర్వాత ఢిల్లీలో కూడా బీజేపీ గెలుపు ఆ పార్టీ  మంచి ఊపునిస్తంది.  లోక్‌సభ ఎదురుదెబ్బ నుండి కోలుకోవడానికి ఈ విజయాలు సాయపడతాయని ఇండియా కూటమి పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. 

ఈ సంవత్సరం చివర్లో బీహార్‌లో వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్‌లో కీలకమైన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్ష కూటమి దిల్లీలో బీజేపీ గెలుపును జీర్ణించుకోలేక పోతోంది. మరోవైపు, జాతీయ స్థాయిలో పుంజుకోవాలంటే, పలు రాష్ట్రాల్లో తిరిగి స్థానం సంపాదించుకోవాలని కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Palamedu Jallikattu Begins in Madurai: తమిళనాడులో హోరా హోరీగా జల్లికట్టు| Asianet News Telugu
JIO : తక్కువ ధరకే 200 జీబీ డేటా.. జియో అద్భుత రీచార్జ్ ప్లాన్