తప్పతాగి.. పోలీసుని కొట్టిన మహిళ

Published : Jul 17, 2019, 10:53 AM ISTUpdated : Jul 17, 2019, 10:55 AM IST
తప్పతాగి.. పోలీసుని కొట్టిన మహిళ

సారాంశం

మద్యం మత్తులో మహిళ వీరంగం హెల్మెట్ లేదని వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు పోలీసు పట్ల మహిళ దురుసు ప్రవర్తన పోలీసుని కొట్టి వాహనం తాళం లాక్కున్న మహిళ

తప్పతాగి వాహనం నడిపిందే కాక... అడ్డుకున్న పోలీసునే కొట్టింది ఓ మహిళ. ఈ సంఘటన  దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఆ సమయంలో యువతితోపాటు... వాహనంపై మరో వ్యక్తి ఉన్నాడని... అతను కూడా మద్యం సేవించి ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. కాగా ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  ఢిల్లీలోని మాయాపురిలో మంగళవారం సాయంత్రం ఓ  యువతి, మరో యువకుడు స్కూటీపై వెళుతున్నారు. కాగా... వారు హెల్మెట్ పెట్టుకోకుండా వాహనం నడుపుతుండటంతో... వారిని పోలీసులు అడ్డుకున్నారు. కాగా... తమ వాహనాన్ని అడ్డుకున్నందుకు ఆ ఇద్దరు యువతీయువకులు వీరంగం సృష్టించారు. తమను వెళ్లనివ్వాలంటూ పోలీసులపై గట్టిగట్టిగా అరవడం మొదలుపెట్టారు. ట్రాఫిక్ పోలీసు పట్ల దురుసుగా ప్రవర్తించారు.

దీంతో... ఆ ట్రాఫిక్ పోలీసు వారి వాహనం తాళం లాగేసుకున్నాడు. దీంతో... కోపంతో ఊగిపోయిన యువతి.. ట్రాఫిక్ పోలీసుపై చెయ్యి చేసుకుంది. అంతేకాకుండా పోలీసు వద్ద నుంచి తాళం కూడా లాక్కుంది.  ఆమె చేసిన పనికి అక్కడ ఉన్నవారంతా నివ్వెరపోయారు. కాగా.. వారిద్దిరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పీకలదాకా మద్యం సేవించడం వల్లే ఆ మహిళ అలా ప్రవర్తించిందని వారు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Indian Population in USA: అమెరికాలో ఇండియన్స్ అడ్డా.. ఈ 5 నగరాల్లోనే ఎక్కువ మంది.. ఎందుకో తెలుసా?
చెన్నై లో నూతన భవనాలను ప్రారంభించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Visits Perambur