ఇంటిబైట పడుకుంటే.. నిద్రలేపి తుపాకీతో కాల్చి...

Published : Mar 15, 2021, 04:07 PM IST
ఇంటిబైట పడుకుంటే.. నిద్రలేపి తుపాకీతో కాల్చి...

సారాంశం

భువనేశ్వర్ లో ఓ ఘటన కలకలం రేపింది. నిద్రపోతున్న వ్యక్తిని లేపి మరీ తుపాకీతో కాల్చి చంపిన ఘటన గుణుపూర్ సబ్ డివిజన్ పరిధిలోని గుడారి పోలీస్‌స్టేషన్‌ సమీపంలో సంచలనం రేకిత్తిస్తోంది.నైరా గ్రామానికి చెందిన కిరణ్ గంటా శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత తన ఇంటిబైట పడుకున్నాడు.   

ఇంతలో తుర్తు తెలియని దుండగులు కొంతమంది అక్కడికి చేరుకుని, అతడిని నిద్రలేపి నుదుటిమీద తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ క్రమంలో అతడు అక్కడిక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచారు. ఆ తరువాత అక్కడ్నుంచి దుండగులు పరారయ్యారు. అయితే తుపాకీ కాల్పుల శబ్దం విన్న ఇంట్లో పడుకున్న బాధిత కుటుంబ సభ్యులు బైటికి వచ్చి చూడగా, రక్తపు మడుగులో ఉన్న కిరణ్ కనిపించాడు. 

వెంటనే అతన్ని పరీక్షించగా అతడు మరణించినట్లు తేలడంతో కుటుంబసభ్యులు బోరుమన్నారు. తన భర్తకి ఎవరితో శత్రుత్వం లేదని, ఇలా ెందుకు జరిగిందో.. ఎవరు చేసి ఉంటారో తమకు తెలియడం లేదని మృతుడి భార్య రైనా గంటా తెలిపింది. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, డాగ్‌స్క్వాడ్, క్లూస్‌ టీం, సైంటిఫిక్‌ బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని, దర్యాప్తు చేస్తున్నారు. 

పాతకక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగిందా లేక మరేదైనా కారణం ఉండి ఉంటుందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నట్లు గుణుపూర్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి రాజ్ కిశోర్ దాస్ తెలిపారు. 
 
PREV
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్