కిరణ్ బేడీ ఉద్వాసనకు.. కీలక కారణాలు ఇవే...

By AN TeluguFirst Published Feb 17, 2021, 3:16 PM IST
Highlights

పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడిని ఆ పదవి నుంచి తొలగించడానికి మూడు ముఖ్యమైన కారణాలున్నాయని తెలుస్తోంది. కిరణ్ బేడీకి ఉత్తమ అధికారిగా పేరుంది. అయితే ఆమె తనకు బీజేపీ పెద్దలు అప్పగించిన లక్ష్యాన్ని నెరవేర్చడంలో విఫలమయ్యారు. 

పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడిని ఆ పదవి నుంచి తొలగించడానికి మూడు ముఖ్యమైన కారణాలున్నాయని తెలుస్తోంది. కిరణ్ బేడీకి ఉత్తమ అధికారిగా పేరుంది. అయితే ఆమె తనకు బీజేపీ పెద్దలు అప్పగించిన లక్ష్యాన్ని నెరవేర్చడంలో విఫలమయ్యారు. 

ముఖ్యమంత్రి వి నారాయణ స్వామి చేసే తప్పులను ఎత్తి చూపాలని ఆమెకు ఆదేశాలుండగా, ఆమె రోజువారీ ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుని, నారాయణ స్వామికి ప్రజల్లో సానుభూతి పెరిగేలా చేశారని బీజేపీ పెద్దలు భావించినట్లు సమాచారం. 

ఇదిలా ఉండగా లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి కిరణ్ బేడీని తప్పించాలని  ముఖ్యమంత్రి వి నారాయణ స్వామి గత ఐదేళ్లుగా పోరాటం చేస్తున్నారు. నిరసన ప్రదర్శనలు, రాష్ట్రపతితో భేటీలు కూడా నిర్వహించారు. 

అయితే చివరికి ఆమెను ఈ పదవి నుంచి కేంద్ర ప్రభుత్వం సోమవారం తొలగించింది. కానీ దీని వెనుక కారణాలు వేరుగా ఉన్నట్లు తెలుస్తోంది. కిరణ్ బేడి రాజకీయ నేత కాకపోవడం, మితర పక్షాల ఒత్తిడి, బీజేపీ పెద్దలు నిర్దేశించిన లక్ష్యాన్ని నెరవేర్చడంలో విఫలమవడం వల్ల ఆమెను ఈ పదవి నుంచి తొలగించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. 

విశ్వసనీయ సమాచారం ప్రకారం, పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. లెఫ్టినెంట్ గవర్నర్ పదవిలో ఓ రాజకీయవేత్తను నియమించాలని బీజేపీ భావిస్తోంది. తగినంత మెజారిటీ రాకపోతే ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించే వ్యక్తిని ఎంపిక చేయాలనుకుంటోంది. 

రానున్న ఎన్నికల కోసం మాజీ ముఖ్యమంత్రి ఎన్ రంగ స్వామి నేతృత్వంలోని ఎన్ఆర్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే చర్చలకు ముందే కిరణ్ బేడీకి ఉద్వాసన పలకాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. ఆ పార్టీతో ఇటీవలే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చర్చలు జరిపారు. 

కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వ వైఫల్యాలను వెలుగులోకి తేవాలని కిరణ్ బేడీకి పదవిని అప్పగించినప్పుడు బీజేపీ పెద్దలు నిర్దేశించినట్లు సమాచారం. అయితే ఆమె ప్రభుత్వ అయితే ఆమె ప్రభుత్వ రోజువారీ ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుని, నారాయణ స్వామికి ప్రజల్లో సానుభూతి పెరిగేలా చేశారని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. 

ఇదిలా ఉంటే లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి కిరణ్ బేడీని తొలగిస్తూ, ఎన్నికల ముందు తీసుకున్న చర్య కేవలం బీజేపీ స్వీయ ప్రయోజనాల కోసమేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

click me!