ఖైదీపై కానిస్టేబుల్ అత్యాచారం

By telugu teamFirst Published Aug 8, 2019, 8:54 AM IST
Highlights

రైలులో ఖైదీ బాత్రూమ్ వెళ్లింది. ఆమె వెంట ఇద్దరు మహిళా సిబ్బంది కూడా వెళ్లారు. అయితే ఖైదీ వాష్ రూమ్ లోకి వెళ్లగానే... కానిస్టేబుల్ అక్కడికి వెళ్లి... ఆ ఇద్దరు మహిళా పోలీసులను వెనక్కి పంపించేశాడు. అనంతరం అతను బాత్రూమ్ లోకి వెళ్లి ఖైదీపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని ఆమెను బెదిరించడం గమనార్హం.

విచారణకు హాజరై తిరిగి వస్తున్న ఖైదీపై ఓ కానిస్టేబుల్ అత్యాచారం చేసిన దారుణ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఈ నెల 3వ తేదీన జరగగా...ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వళితే... తీహాడ్ జైలులో ఖైదీగా ఉన్న  42ఏళ్ల మహిళ పశ్చిమ బెంగాల్ లోని ముర్షీదాబాద్ లో కోర్టుకి హాజరై తిరిగి ఢిల్లీ కి రైలులో బయలుదేరింది. ఆ సమయంలో ఖైదీతోపాటు ఇద్దరు మహిళా పోలీసు సిబ్బంది, ఒక కానిస్టేబుల్ ఉన్నారు. ఈ క్రమంలో రైలులో ఖైదీ బాత్రూమ్ వెళ్లింది. ఆమె వెంట ఇద్దరు మహిళా సిబ్బంది కూడా వెళ్లారు. 

అయితే ఖైదీ వాష్ రూమ్ లోకి వెళ్లగానే... కానిస్టేబుల్ అక్కడికి వెళ్లి... ఆ ఇద్దరు మహిళా పోలీసులను వెనక్కి పంపించేశాడు. అనంతరం అతను బాత్రూమ్ లోకి వెళ్లి ఖైదీపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని ఆమెను బెదిరించడం గమనార్హం.

తర్వాత ఆమె తీహాడ్‌ జైలుకు వెళ్లి ఈ విషయాన్ని అక్కడి వైద్యులకు, సూపరింటెండెంట్‌కు వివరించింది. దీంతో హరినగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ఖైదీకి వైద్య పరీక్షలు నిర్వహించారు.

click me!