
Crime: తన ఉద్యోగిని చంపి.. మృత దేహాన్ని బ్యాగులో పెట్టి.. మెట్రో స్టేషన్ (Metro Station)లో పాడేశాడు ఓ వ్యాపారి (Businessman). ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుకుంది. ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దీనిపై విచారణ జరుపుతున్నారు. వివరాల్లోళ్తే.. దక్షిణ ఢిల్లీలోని సరోజినీ నగర్‌లో సెక్స్ బ్లాక్‌మెయిల్ వీడియో కారణంగా తన ఉద్యోగిని హత్య చేసినందుకు వస్త్ర వ్యాపారిని అరెస్టు చేశారు. హత్యకు సహకరించిన వ్యాపారి మేనల్లుడు సహా మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి గౌరవ్ శర్మ తెలిపారు. ఉద్యోగిని హత్య చేసిన అనంతరం వారు ఉద్యోగి మృతదేహాన్ని ట్రాలీ బ్యాగ్ (trolley bag) లో ఉంచారు. దానిని దక్షిణ ఢిల్లీ మార్కెట్‌కు సమీపంలో ఉన్న సరోజినీ నగర్‌లోని మెట్రో స్టేషన్ (Metro Station) వెలుపల పడేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని సరోజినీ నగర్ లో వస్త్ర వ్యాపారి (Businessman) వద్ద పనిచేస్తున్న 22ఏళ్ల ఉద్యోగి తన 36 ఏళ్ల యజమానితో సెక్సువల్ రిలేషన్ పెట్టుకుంది. అదంతా వీడియో రికార్డు చేసిన మరో ఉద్యోగి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు రాబట్టాలని ప్లాన్ చేశాడు. ఇద్దరు పిల్లలున్న వ్యాపారిని డబ్బులు ఇవ్వాలని లేదంటే సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేస్తానంటూ బెదిరించాడు. వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని సదరు ఉద్యోగి వ్యాపారిని బెదిరించాడని పోలీసులు తెలిపారు.
దీంతో బెదిరింపులకు పాల్పడుతున్న ఉద్యోగికి డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తూ.. ఉద్యోగిని హత్య చేయడానికి ప్రణాళికలు రచించారు. ఈ క్రమంలోనే ఆ వ్యాపారవేత్త ఉత్తరప్రదేశ్‌లోని ఒక గ్రామంలో నివసిస్తున్న తన మేనల్లుడును జనవరి 28న ఢిల్లీకి పిలిపించాడు. అతను ఉండటానికి సరోజినీ నగర్‌కు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ ఢిల్లీలోని యూసుఫ్ సరాయ్ (Yusuf Sarai)లోని గెస్ట్‌హౌస్‌లో రెండు గదులను బుక్ చేశాడు. వారు పెద్ద ట్రాలీ బ్యాగ్ (trolley bag) ని తీసుకెళ్లడం సీసీటీవీ కెమెరాలో కనిపించిందని పోలీసులు తెలిపారు. ఏదో పని నిమిత్తం సదరు ఉద్యోగిని గెస్ట్‌హౌస్‌కు పిలిచి, అక్కడికి చేరుకోగానే.. అతని గొంతును తాడుతో గట్టిగా బిగించి.. ప్రాణాలు తీశారని పోలీసులు తెలిపారు. అక్కడి నుంచి మృతదేహాన్ని ట్రాలీ బ్యాగ్ (trolley bag) లో ఎక్కించుకుని టాక్సీలో సరోజినీ నగర్ మెట్రో స్టేషన్ (Metro Station)కు తీసుకెళ్లి అక్కడ పడేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నేరానికి పాల్పడిన వ్యాపారి(Businessman) తో పాటు అతనికి సహకరించిన మరో మగ్గురిని పోీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలావుండగా, ఉత్తరప్రదేశ్ (uttarpradesh)లోని బులంద్‌షహర్‌లో మరో హత్రాస్ ఘటన చోటు చేసుకుంది. ఓ 16 యేళ్ల బాలిక దారుణ హత్యాచారానికి గురైంది. అయితే పోలీసులు హడావుడిగా బాలిక cremation చేయించడంతో తల్లిదండ్రులు తమ కూతురి deathపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చనిపోయేముందు కూతురి మీద gang rape జరిగిందని ఆరోపిస్తూ, ఆమె అంత్యక్రియలకు పూర్తి ఏర్పాట్లు చేయకముందే పోలీసులు మైనర్‌ను దహనం చేయమని బలవంతం చేశారని ఆరోపించింది.