
న్యూఢిల్లీ : న్యూ ఇయర్ రోజున ఢిల్లీలో కారు కింద చిక్కుకున్న అంజలీసింగ్ను 13 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి ఆమె మృతికి కారణమైన దారుణ ఘటనలో నలుగురు వ్యక్తులపై పోలీసులు హత్యానేరం మోపారు. అమిత్ ఖన్నా, కృష్ణ, మనోజ్ మిట్టల్, మిథున్ లు అంజలి సింగ్ (20)ని అత్యంత అనాగరికంగా హత్య చేశారని ఢిల్లీ పోలీసులు నిన్న కోర్టుకు తెలిపారు.
జనవరి 1వ తారీఖు తెల్లవారుజామున ఢిల్లీలోని కంఝవాలాలో రోడ్డుపై అంజలిని ఢీకొట్టిన తర్వాత.. ఆమెను రక్షించడానికి వారికి చాలా అవకాశాలు ఉన్నాయని పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జ్ షీట్‌లో తెలిపారు. మహిళ కారు ఇంజన్‌లో ఇరుక్కుపోయిందని నలుగురికి తెలిసినా ఉద్దేశపూర్వకంగానే ఆమెను.. అలాగే చాలా కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారని పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఢిల్లీ అంజలీ సింగ్ ఘటన : ప్రమాద సమయంలో కారులో ఉన్నది ఐదుగురు కాదు.. నలుగురే...
ఛార్జ్ షీట్ ప్రకారం నేరం రెండు దశల్లో జరిగింది - స్కూటర్ నడుపుతున్న అంజలి సింగ్‌ను కారు ఢీకొట్టడం.. అంజలీసింగ్ కారు కింద ఇరుక్కున్నాక లాక్కుపోవడం.. ప్రమాదం జరిగిన ప్రదేశానికి 500-600 మీటర్ల దూరంలో పురుషులు కారును ఆపారు. మహిళ కారు కింద ఇరుక్కుపోయిందో లేదో తనిఖీ చేయడానికి డ్రైవర్ కారు నుండి కిందికి దిగాడు. కారులో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు నిర్ధారించేందుకు సాక్షుల ఖాతాలు, సీసీటీవీ కెమెరా ఫుటేజీలు, ఇతర ఆధారాలను చార్జ్ షీట్ ఉదహరించింది. అమిత్ ఖన్నా డ్రైవింగ్ చేస్తుండగా, మనోజ్ మిట్టల్ ముందు సీట్లో కూర్చున్నాడు.
ఛార్జ్ షీట్‌లో ఆరుగురు సాక్షులను చేర్చారు. ప్రమాదం సమయంలో ఆమెతో ఉండి, ఆ తరువాత అక్కడినుంచి పారిపోయిన అంజలీసింగ్ స్నేహితురాలి అకౌంట్ ను చార్జిషీట్‌లో చేర్చారు. కారు కింద మృతదేహాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆటోరిక్షా డ్రైవర్ కూడా సాక్షిగా చేర్చారు. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రగిల్చింది. రోడ్ సేఫ్టీ గురించి ప్రశ్నలను లేవనెత్తింది. ఈ ఘటన తరువాత నేరాన్ని కప్పిపుచ్చడానికి సహాయం చేసిన ముగ్గురు నిందితులతో సహా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.