ఢిల్లీ ట్రాక్టర్ ర్యాలీలో హింసపై రైతు సంఘాల నేతలకు నోటీసులు: దీప్‌సిద్దు కోసం పోలీసుల గాలింపు

By narsimha lodeFirst Published Jan 28, 2021, 10:31 AM IST
Highlights

 ఢిల్లీ ట్రాక్టర్ ర్యాలీలో చోటు చేసుకొన్న హింసపై రైతు సంఘాల నేతలకు  పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరోవైపు పంజాబ్ నటుడు దీప్ సిద్దూకు పోలీసులు నోటీసులు  పంపారు. రిపబ్లిక్ డే రాత్రి నుండి ఆయన ఫోన్ స్విచ్ఛాప్ చేసి ఉందని పోలీసులు చెబుతున్నారు


న్యూఢిల్లీ: ఢిల్లీ ట్రాక్టర్ ర్యాలీలో చోటు చేసుకొన్న హింసపై రైతు సంఘాల నేతలకు  పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరోవైపు పంజాబ్ నటుడు దీప్ సిద్దుకు పోలీసులు నోటీసులు  పంపారు. రిపబ్లిక్ డే రాత్రి నుండి ఆయన ఫోన్ స్విచ్ఛాప్ చేసి ఉందని పోలీసులు చెబుతున్నారు.

నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఈ నెల 26న ఢిల్లీలో రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సమయంలో ఢిల్లీలోని పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకొన్నాయి. ఎర్రకోటను కొందరు ఆందోళన కారులు ముట్టడించారు. 

also read;ఢిల్లీ ట్రాక్టర్ ర్యాలీలో హింస: 22 కేసులు నమోదు

ఢిల్లీ ట్రాక్టర్ ర్యాలీలో చోటు చేసుకొన్న హింసపై రైతు సంఘాల నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరోవైపు పంజాబ్ నటుడు దీప్ సిద్దూకు పోలీసులు నోటీసులు పంపారు. రిపబ్లిక్ డే రాత్రి నుండి ఆయన ఫోన్ స్విచ్ఛాప్ చేసి ఉందని పోలీసులు చెబుతున్నారు. pic.twitter.com/JcMgEz36mK

— Asianetnews Telugu (@AsianetNewsTL)

ఎర్రకోట ముట్టడి ఘటనకు తమకు సంబంధం లేదని రైతు సంఘాలు ప్రకటించాయి. పంజాబ్ రాష్ట్రానికి చెందిన నటుడు, సింగర్  దీప్ సిద్దు కారణంగా రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.ఈ నెల 26వ తేదీన హింసాత్మక  ఘటనలు చోటు చేసుకొన్న తర్వాత  దీప్ సిద్దు కన్పించకుండా పోయాడు. అతని ఫోన్ స్విచ్ఛాప్ చేసి ఉంది. పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఎర్రకోట ముట్టడిని దీప్  దీప్ సిద్దు సమర్ధించుకొన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. రైతుల ఆగ్రహాన్ని ఈ ఘటన చూపిందని ఆయన చెప్పారు.ఎర్రకోట ముట్టడిలో తప్పేమీ లేదని ఆయన సమర్ధించుకొన్నారు. 

 

చివరిసారిగా ఆయన ఫోన్ హర్యానా రాష్ట్రంలో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఎర్రకోట ముట్టడి ఘటనలో  దీప్ సిద్దుపై కూడ పోలీసులు కేసు నమోదు చేశారు.రైతులను  దీప్ సిద్దు రెచ్చగొట్టారని పోలీసులు ఆరోపిస్తున్నారు.గ్యాంగ్ స్టర్ లకా సిధానపైనా కూడ పోలీసులు కేసు నమోదు చేశారు. రైతు సంఘం నేత దర్శన్ పాల్ కు కూడ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ నోటీసులు పంపిన పోలీసులు. మూడు రోజులుగా వివరణ ఇవ్వాలని ఆదేశం.ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా చోటు చేసుకొన్న హింసాత్మక ఘటనలను పురస్కరించుకోని మొత్తం 22 కేుసులు నమోదు చేశారు పోలీసులు.

click me!