
ముంబయి: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్‌కు ప్రాణ హాని తలపెడతామని బెదిరింపులు చేసింది ఓ బీజేపీ కార్యకర్తనే అని అజిత్ పవార్ ఆరోపించారు. అతని పేరు సౌరభ్ పింపల్కర్ అని వివరించారు. ఆయన తనను తాను బీజేపీ వర్కర్‌గా పేర్కొన్నాడని తెలిపారు.
‘ఈ యువకుడు సౌరభ్ పింపల్కర్. తన సోషల్ మీడియా ఖాతాలో బెదిరింపులు చేశాడు. నరేంద్ర దబోల్కర్‌కు పట్టిన గతే శరద్ పవార్‌కు కూడా పడుతుందని రాశాడు. ఆయన సోషల్ మీడియా అకౌంట్ బయోడేటాలో సౌరబ్ పింపల్కర్ తనను తాను బీజేపీ వర్కర్ అని పేర్కొన్నాడు. ఆయన నిజంగా బీజేపీతో సంబంధాలు ఉన్నవాడేనా? ఆయన నిజంగా బీజేపీ కార్యకర్తనేనా?’ అని అజిత్ పవార్ పేర్కొన్నారు. ఇలాంటి ‘బాధ్యతారాహిత్య ప్రవర్తన’ను తీవ్రంగా ఖండించారు.
తన తండ్రి శరద్ పవార్‌ను చంపేస్తామని తన వాట్సాప్‌నకు ఓ మెస్సేజీ వచ్చిందని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే శుక్రవారం తెలిపారు. శరద్ పవార్ భద్రత బాధ్యతలు మహారాష్ట్ర హోం శాఖకు ఉంటాయని, ఇందులో కేంద్ర హోం శాఖ అమిత్ షా వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.
Also Read: భారత ముస్లింలు జిహాద్, హింసకు ప్రాధాన్యత ఇవ్వరు, అందుకోసం ఖర్చు పెట్టరు: ఖాలీద్ జహంగీర్
శరద్ పవార్‌కు ఫేస్‌బుక్‌లోనూ బెదిరంపులు వచ్చాయని ఎన్సీపీ నేతలు తెలిపారు. ఆయనకు కూడా త్వరలోనే నరేంద్ర దబోల్కర్ గతే పడుతుందని ఆ వ్యాఖ్యలు ఉన్నాయి. నరేంద్ర దబోల్కర్ మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పని చేశారు. అతనిని 2013 ఆగస్టు 20న మార్నింగ్ వాక్ చేస్తుండగా ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి తుపాకీతో కాల్చి చంపేసి వెళ్లిపోయారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా కలకలం రేపింది.