రోడ్డు ప్రమాదంలో సోషల్ మీడియా స్టార్ రౌడీ భాటి మృతి.. అభిమానుల ఆశ్రునయనాల మధ్య తుది వీడ్కోలు

Published : Nov 22, 2022, 10:34 AM IST
రోడ్డు ప్రమాదంలో సోషల్ మీడియా స్టార్ రౌడీ భాటి మృతి.. అభిమానుల ఆశ్రునయనాల మధ్య తుది వీడ్కోలు

సారాంశం

సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రౌడీ భాటి అలియాస్ రోహిత్ భాటి సోమవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ ఘటన  గ్రేటర్ నోయిడాలోని బీటా-2 పోలీస్ స్టేషన్ పరిధిలోని చుహార్‌పూర్ అండర్‌పాస్ సమీపంలో జరిగింది. అతివేగమే అతని మరణానికి కారణమని తెలుస్తోంది.

డైలాగ్స్ , యాక్టింగ్ వీడియోలతో సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రౌడీ భాటి అలియాస్ రోహిత్ భాటి సోమవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ ఘటన  గ్రేటర్ నోయిడాలోని బీటా-2 పోలీస్ స్టేషన్ పరిధిలోని చుహార్‌పూర్ అండర్‌పాస్ సమీపంలో జరిగింది. అతివేగమే అతని మరణానికి కారణమని తెలుస్తోంది. వేగంగా వెళ్తున్న ఆయన కారు అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న రోహిత్ భాటి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో కారులో ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గ్రేటర్ నోయిడా, ఢిల్లీలోని ఆస్పత్రుల్లో చేర్పించారు. 

ఈ ఘటనపై పోలీసు ఇన్‌చార్జి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. పార్టీ నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు. తెల్లవారుజామున 3 గంటలకు చుహార్‌పూర్ అండర్‌పాస్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అతివేగం కారణంగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిందని తెలిపారు.  ఈ ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవింగ్ సీటుపై రౌడీ భాటీ కూర్చున్నట్లు బీటా-2 స్టేషన్ ఇన్‌ఛార్జ్ అనిల్ రాజ్‌పుత్ తెలిపారు. అతడి తలకు బలమైన గాయమైంది. ముగ్గురిని ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ వైద్యులు రౌడీ భాటీగా చనిపోయినట్లు ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన మనోజ్, అతిష్‌లకు చికిత్స కొనసాగుతోందని తెలిపారు. అయితే గాయపడిన యువకులిద్దరూ ఎక్కడ ఉన్నారనే సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం..  గాయపడిన వారిలో ఒకరు గ్రేటర్ నోయిడాలోని గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (జిమ్స్)లో చికిత్స పొందుతున్నారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఢిల్లీకి రిఫర్ చేసినట్టు సమాచారం. 

ఇన్‌స్టాగ్రామ్‌లో తొమ్మిది లక్షల మంది ఫాలోవర్లు 

బులంద్‌షహర్‌లోని సికింద్రాబాద్‌లో నివాసం ఉండే రోహిత్ భాటి సోషల్ మీడియాలో రౌడీ భాటీగా ప్రసిద్ధి చెందాడు. రౌడీ ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలోని చాయ్ సెక్టార్‌లో ఉన్న నింబస్ సొసైటీలో నివసిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రౌడీ భాటికి తొమ్మిది లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. అతని పేరు మీద తన అభిమానులు చాలా అకౌంట్లు క్రియేట్ చేశారు.కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లోనే కాదు..యూట్యూబ్‌లోనూ చాలా ఫేమస్..అతని నటన, డైలాగ్‌లు,పాటలు సంబంధించిన వీడియోలకు లక్షల్లో వ్యూస్ ఉన్నాయి. ప్రమాద వార్త తెలియగానే రోహిత్ ఫాలోవర్స్ సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తూ..అతనికి సంబంధించిన అనేక వీడియోలను షేర్ చేస్తూ నివాళి ఆర్పించారు.బులంద్‌షహర్‌లో జరిగిన అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు.

PREV
click me!

Recommended Stories

Thalapathy Vijay Takes Charge At CM: తొలి రోజే అధికారులని పరుగులు పెట్టించిన విజయ్ | Asianet Telugu
Vijay First Signatures: సీఎం గా బాధ్యతలు చేపట్టిన వెంటనే విజయ్ సంచలన సంతకాలు| Asianet News Telugu