మరోసారి అసంపూర్తిగా ముగిసిన చర్చలు: ఈ నెల 8న రైతులతో కేంద్రం చర్చలు

By narsimha lodeFirst Published Jan 4, 2021, 8:30 PM IST
Highlights

రైతులతో కేంద్ర ప్రభుత్వం సోమవారం నాడు చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో దీక్షలు కొనసాగిస్తున్నారు.

న్యూఢిల్లీ: రైతులతో కేంద్ర ప్రభుత్వం సోమవారం నాడు చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో దీక్షలు కొనసాగిస్తున్నారు.

సోమవారం నాడు సాయంత్రం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి.మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతు సంఘాలు చేసిన డిమాండ్ పై  కేంద్రం మాత్రం తలొగ్గలేదు. 

మరో వైపు చర్చలకు రావాలని కేంద్రం పిలుపునిచ్చింది. రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో 40 రోజులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

రైతు సంఘాలతో  ఈ నెల 8వ తేదీన మరోసారి కేంద్రం చర్చించనుంది.  రైతు సంఘాలు నిబంధనల వారీగా మూడు చట్టాలను చర్చించాలని చర్చించాలని తాము కోరుకొంటున్నామని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు.

రైతు సంఘం మొండిగా ఉన్నందున మేం ఎటువంటి పరిష్కారాన్ని చేరుకోలేకపోయినట్టుగా మంత్రి తెలిపారు. 

పంట మద్దతు ధరపై గ్యారంటీ ఇవ్వాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పంట మద్దతు ధరపై జాయింట్ కమిటీ వేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. వ్యవసాయ చట్టాలను రద్దు చేసే యోచన లేదని ఆయన చెప్పారు.
 

click me!