రాబర్ట్ వాద్రా: ఐటీ అధికారుల స్టేట్‌మెంట్ రికార్డు

By narsimha lodeFirst Published Jan 4, 2021, 3:58 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా నుండి ఆదాయపన్ను శాఖాధికారులు సోమవారం నాడు స్టేట్ మెంట్ రికార్డు చేశారు.

రాబర్ట్ వాద్రా:   ఐటీ అధికారుల స్టేట్‌మెంట్ రికార్డు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా నుండి ఆదాయపన్ను శాఖాధికారులు సోమవారం నాడు స్టేట్ మెంట్ రికార్డు చేశారు.

యూకేలో ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారి ద్వారా కొనుగోలు చేసిన ఆస్తుల కేసులో ఐటీ శాఖాధికారులు రాబర్ట్ వాద్రా నుండి ఈ స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు.

ఈ విషయమై 2018లో వాద్రాపై మనీలాండరింగ్ కేసులో ఈడీ ఆయనను విచారిస్తోంది. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీలోని సుఖ్ దేవ్ విహార్ లోని మిస్టర్ వాద్రా కార్యాలయానికి ఐటీ బృందం చేరుకొందని వర్గాలు తెలిపాయి. 

రాబర్ట్ వాద్రా యూకేలో అనేక రెండు ఆస్తులను కలిగి ఉన్నారని ఆరోపణలున్నాయి. వాటిలో ఒకటి లండన్ లోని బ్రైస్టన్ స్వ్కేర్ లో 1.9 మిలియన్ పౌండ్ల విలువైందని చెబుతున్నారు.

సుమారు 37.42 కోట్ల 46.77 కోట్ల విలువైన రెండు ఆస్తులున్నాయని ఐటీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇవి కాకుండా మరో ఆరు ప్లాట్లు కూడా వాద్రాకు చెందినవిగా ఈడీ వర్గాలు అనుమానిస్తున్నాయి.

2005 నుండి 2010 మధ్య కాలంలో 12 మిలియన్ పౌండ్ల విలువైన ఆస్తులను కొనుగోలు చేసినట్టుగా ఆరోపణలు  ఎదుర్కొన్నారు.
 

click me!