ఏపీ భవన్ వద్ద మృతదేహం... శ్రీకాకుళం వాసిగా గుర్తింపు

Siva Kodati |  
Published : Feb 11, 2019, 11:22 AM IST
ఏపీ భవన్ వద్ద మృతదేహం... శ్రీకాకుళం వాసిగా గుర్తింపు

సారాంశం

దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద ఓ వికలాంగుడి మృతదేహం కలకలం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున అక్కడి సిబ్బంది చక్రాల కుర్చీలో ఉన్న ఓ వ్యక్తిని గుర్తించారు. దగ్గరికి వెళ్లి లేపేందుకు ప్రయత్నించినప్పటికీ స్పందించకపోవడంతో ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. 

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద ఓ లేఖ, పక్కనే చిన్న బాటిల్, రూ.20 నోటును గుర్తించారు. మృతుడిని ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం వాసిగా పేర్కొన్నారు. పురుగుల మందు తాగి అతను ఆత్మహత్యకు పాల్పడి వుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాతో పాటు విభజన హామీల అమలు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న రాత్రే ఢిల్లీ చేరుకోవడంతో అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఉంది. ఈ క్రమంలో మృతదేహం కంటబడటంతో తీవ్ర కలకలం రేగింది. 

PREV
click me!

Recommended Stories

EPI 2024 లో అద్భుత ర్యాంకు సాధించిన యూపీ.. అసలు ఇదేమిటో తెలుసా?
Budget : ఆ ఒక్క బడ్జెట్ దేశ జాతకాన్నే మార్చేసింది.. డ్రీమ్ బడ్జెట్ అసలు కథ ఇదే !