కరోనా బాధితులకు ఉపశమనం కలిగించేలా పలు ఔషధాలకు భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) త్వరగా క్లియరెన్స్‌లు ఇస్తోంది. దీనిలో భాగంగానే తాజాగా అత్యవసర వినియోగానికి మరో ఔషధానికి అనుమతినిచ్చింది. భారత రక్షణ రంగానికి చెందిన డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన 2-డీజీ ఔషధం వినియోగానికి డీసీజీఐ అనుమతి లభించింది
దేశవ్యాప్తంగా కరోనా కేసులు రాకెట్ వేగంతో పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 4 లక్షలకు పైగా కేసులు, 4 వేలకు పైగా మరణాలతో ఇండియాలో దారుణ పరిస్ధితులు నెలకొన్నాయి. ఇప్పటికే వివిధ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తుండగా.. మరికొన్ని చోట్ల కర్ఫ్యూ తరహా వాతావరణం కనిపిస్తోంది.
కానీ ఇవేవీ ఆశించిన మేర ఫలితాలను ఇవ్వడం లేదు. ముఖ్యంగా అత్యంత కీలకమైన వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది. ఈ నేపథ్యంలో కరోనా బాధితులకు ఉపశమనం కలిగించేలా పలు ఔషధాలకు భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) త్వరగా క్లియరెన్స్‌లు ఇస్తోంది.
undefined
Also Read:టీకాల కొరతపై ఆరోపణలు.. రాష్ట్రాల వద్దే 84 లక్షల డోసులు: కేంద్రం కౌంటర్
దీనిలో భాగంగానే తాజాగా అత్యవసర వినియోగానికి మరో ఔషధానికి అనుమతినిచ్చింది. భారత రక్షణ రంగానికి చెందిన డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన 2-డీజీ ఔషధం వినియోగానికి డీసీజీఐ అనుమతి లభించింది. కోవిడ్ చికిత్సలో ఈ డ్రగ్‌ను వినియోగించినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.
స్వల్ప, మధ్య స్థాయి కరోనా లక్షణాలతో బాధపడేవారికి ఈ ఔషధం బాగా పనిచేస్తుందని డీసీజీఐ తెలిపింది. ఇది పౌడర్ రూపంలో లభించనుంది. 2-డీజీ ఔషధాన్ని నీళ్లలో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. ‘వైరస్ ఇన్‌ఫెక్ట్ అయిన సెల్స్‌తో పాటు, శరీరంలో వైరస్ వేగంగా వ్యాపించకుండా ఇది అడ్డుకుంటుందని డీఆర్‌డీవో తెలిపింది.