ఆస్తిలో కొడుకులతో పాటు కూతుళ్లకు సమాన వాటా: సుప్రీం సంచలన తీర్పు

By narsimha lodeFirst Published Aug 11, 2020, 1:49 PM IST
Highlights

తండ్రి ఆస్తి విషయంలో సుప్రీంకోర్టు మంగళవారం నాడు సంచలన తీర్పు ఇచ్చింది. కొడుకులతో పాటు కూతుళ్లకు కూడ ఆస్తిలో సమాన వాటా ఉంటుందని సుప్రీం తేల్చి చెప్పింది.

న్యూఢిల్లీ: తండ్రి ఆస్తి విషయంలో సుప్రీంకోర్టు మంగళవారం నాడు సంచలన తీర్పు ఇచ్చింది. కొడుకులతో పాటు కూతుళ్లకు కూడ ఆస్తిలో సమాన వాటా ఉంటుందని సుప్రీం తేల్చి చెప్పింది.

2005 సెప్టెంబర్ 9 నాటికి తండ్రి బతికి ఉన్నా మరణించినా కూడ ఆయన ఆస్తిలో కొడుకులతో పాటు కూతుళ్లకు కూడ సమాన వాటా ఉంటుందని  సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

హిందూ వారసత్వ చట్టం సవరణపై సుప్రీంకోర్టు ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చింది.చట్టం అమల్లోకి వచ్చేనాటికి తండ్రి మరణించినా కూడ సమాన హక్కు వర్తిస్తోందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.ఆడపిల్లలకు ఆస్తిలో సమాన వాటా పంచాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

వరకట్న వేధింపులు లేకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఈ చట్టం తీసుకొచ్చింది. హిందూ వారసత్వ చట్టంలో కొన్ని సవరణలు తీసుకొస్తూ 2005 సెప్టెంబర్ 9వ తేదీన ఈ చట్టాన్ని అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది. 

ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలో పలు కేసులు కోర్టుల్లో వచ్చాయి. పూలా దేవి కేసు సుప్రీంకోర్టుకు వచ్చింది.  ఈ చట్టం అమల్లోకి వచ్చే నాటికి ఆస్తి పంచకపోతే దానిపై ఎలాంటి క్లైయిమ్ చేసుకోవడానికి వీల్లేదు. కానీ పంపకానికి నోచుకోని ఆస్తుల్లో మహిళలకు సమావ వాటా ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

ఉమ్మడి ఏపీరాష్ట్రంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మహిళలకు ఆస్తిలో సమాన హక్కును కల్పించిన విషయం తెలిసిందే.

click me!