యువకుల ప్రాణం కోసం.. తమ ఒంటిపై చీరలు తీసి మరీ...

By telugu news teamFirst Published Aug 11, 2020, 1:41 PM IST
Highlights

రిని చూసిన ముగ్గురు మహిళలు.. వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. వారి వద్ద ఎలాంటి తాడు లేకపోవడంతో.. తమ ఒంటిపై ఉన్న చీరలను విప్పదీసి.. ఆ మూడింటినీ ముడి వేసి.. వెంటనే డ్యామ్ లో ఉన్న కుర్రాళ్లకు అందేలా వేశారు. వారు పట్టుకోగానే.. తమ బలమంతా ఉపయోగించి వారిని పైకి లాగారు. 


ప్రస్తుతం సమాజంలో మానవత్వం చచ్చిపోయింది. కళ్లెదుట ప్రాణం పోతున్నా.. కనీసం ఎవరూ స్పందించడం లేదంటూ రోజూ వార్తల్లో చదువుతూనే ఉన్నాం. అయితే.. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు మంచి మనసు ఉన్న మహాత్ములు ఉన్నారు. ఈ  పైన ఫోటోలో కనిపిస్తున్న స్త్రీలే అందుకు నిదర్శనం. తమ కళ్ల ముందు ప్రాణాలు పోతున్న వ్యక్తులను కాపాడేందుకు వీరు.. తమ ఒంటిపై ఉన్న చీరలను తీసి మరి వారిని కాపాడారు. ఈ సంఘటన  తమిళనాడు  రాష్ట్రంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తమిళనాడు రాష్ట్రం పెరంబళూరు జిల్లా కొట్టరాయి ప్రాంతానికి చెందిన  మహిళలు.. తమ మానాన్ని పక్కన పెట్టి యువకుల ప్రాణం నిలబెట్టారు.  స్థానికంగా ఉన్న ఓ డ్యామ్ లో కొందరు కుర్రాళ్లు ప్రమాదవశాత్తు పడిపోయారు. వారిని చూసిన ముగ్గురు మహిళలు.. వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. వారి వద్ద ఎలాంటి తాడు లేకపోవడంతో.. తమ ఒంటిపై ఉన్న చీరలను విప్పదీసి.. ఆ మూడింటినీ ముడి వేసి.. వెంటనే డ్యామ్ లో ఉన్న కుర్రాళ్లకు అందేలా వేశారు. వారు పట్టుకోగానే.. తమ బలమంతా ఉపయోగించి వారిని పైకి లాగారు. 

ఆ యువకులు క్రికెట్ మ్యాచ్ అనంతరం డ్యామ్ లో స్నానానికి వచ్చి ప్రమాదంలో పడినట్లు సమాచారం. గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు పడుతుండటంతో డ్యామ్ లో నీటి మట్టం బాగా పెరిగిపోయింది. దీంతో.. వారు ప్రమాదంలో పడ్డారు. 

కాగా.. వారిని చూసిన సెంటమిజ్ సెల్వి, ముతమల్ మరియు ఆనందవల్లి  లు వెంటనే తమ చీరల సహాయంతో కాపాడారు. అయితే... మొత్తం నలుగురు కుర్రాళ్లు నీటిలో మునగగా.. ఇద్దరిని ఈ మహిళలు కాపాడగలిగారు. మరో ఇద్దరు నీటిలో మునిగివడం గమనార్హం. కాగా. సదరు మహిళలు చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వారికి ఎంత గొప్ప అవార్డు ఇచ్చిన తప్పులేదని పేర్కొంటున్నారు. నెట్టింట కూడా వారిపై ప్రశంసలు కురుస్తున్నాయి.

click me!