
న్యూఢిల్లీ : ఢిల్లీలో ఆదివారం వెలుగు చూసిన వృద్ధ దంపతుల హత్యకు సంబంధించి వారి కోడలే నిందితురాలిగా పోలీసులు తేల్చారు. ఆమె మరో ఇద్దరు స్నేహితులతో కలిసి వారిని హత్య చేసిందని తెలిపారు. 70 ఏళ్ల వయసున్న భార్యభర్తలిద్దరు సీనియర్ సిటిజన్లు ఢిల్లీలోని గోకుల్‌పురి ప్రాంతంలో హత్యకు గురయ్యారు. గోకుల్ పురిలోని ఓ ఇంట్లో కొడుకు, కోడలుమనవడితో కలిసి వీరు నివసిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం, వారి కోడలు మోనికా వీరిని హత్య చేయడానికి ఇద్దరు వ్యక్తుల సహాయం తీసుకుంది. ఆ ఇద్దరిలో ఒకరు ఆమె ప్రియుడు అని పోలీసులు అనుమానిస్తున్నారు. వృద్ధుడు రాధేశ్యామ్ వర్మ, రిటైర్డ్ ప్రభుత్వ పాఠశాల వైస్ ప్రిన్సిపాల్, తన భార్యతో కలిసి గ్రౌండ్ ఫ్లోర్‌లో నివసిస్తుండగా, మోనికా, ఆమె భర్త వారి కుమారుడు మొదటి అంతస్తులో ఉంటున్నారు.
పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదని.. 17యేళ్ల బాలికపై కత్తితో దాడి చేసిన ప్రేమికుడు..
హత్య జరిగిన రోజు మోనికా తన బాయ్‌ఫ్రెండ్, మరొక వ్యక్తిని ఇంటి టెర్రస్‌పైకి తీసుకువెళ్లింది. అక్కడ వారు చీకటి పడేవరకు దాక్కున్నారు. ఆ తరువాత అంతా సద్దుమణిగిన తరువాత వృద్ధ దంపతుల బెడ్‌రూమ్‌లోకి ప్రవేశించి వారి గొంతు కోసి చంపారని పోలీసులు తెలిపారు.
హత్యలకు సంబంధించిన సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించి, తదుపరి విచారణ జరుపుతున్నారు. హత్యల వెనుక ఉద్దేశ్యం ఆస్తికి సంబంధించిన వివాదమేనని భావిస్తున్నారు, ఇంటిని అమ్మకానికి పెట్టారని.. అడ్వాన్స్ లో భాగంగా ఇచ్చిన రూ. 4 లక్షల నగదు కూడా దంపతుల హత్య తరువాత కనిపించడం లేదని పోలీసులు తెలిపారు.