తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో 200 ఏళ్లనాటి దేవాలయంలోకి దళితులు తొరి ప్రవేశించారు. డ్రమ్స్‌తో లోపటికి వెళ్లిన దళితులు దేవుడికి పూజలు చేశారు. తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో ఈ ఘటన జరిగింది.
చెన్నై: దేశంలో పలు చోట్ల ఇప్పటికీ దళితుల ఆలయ ప్రవేశాలపై ఆంక్షలు ఉన్నాయి. అయితే, ఆయా ప్రభుత్వాలు, లేదా కార్యకర్తల కృషి వల్ల కొన్ని ప్రాంతాల్లో వారికి ప్రవేశ అనుమతులు లభిస్తున్నాయి. తాజాగా, తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో చిన్నసేలం పట్టణంలో వరదరాజ పెరుమాల్ ఆలయంలో దళితులకు ప్రవేశం లభించింది.
ఈ ఆలయం 200 ఏళ్ల పురాతనమైనది. కానీ, అప్పటి నుంచీ ఈ ఆలయంలోకి దళితుల (ఎస్సీ) ప్రవేశానికి అనుమతులు లేవు. ఏళ్ల తరబడి ఈ విషయమై నిరసనలు జరిగాయి. తమను ప్రవేశించడానికి అనుమతించి.. ఆ దైవానికి పూజలు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని వారు నిరసనలు చేశారు.
కానీ, తాజాగా, వారిని ఆలయంలోకి అనుమతించాలని ఆదేశాలు వచ్చాయి. హిందూ రిలీజియస్, చారిటబుల్ ఎండోమెంట్ శాఖ నుంచి జిల్లా కలెక్టర్ శ్రవణ్ కుమార్, మరో అధికారికి డైరెక్షన్స్ వచ్చాయి. ఆ ఆలయం ఇప్పుడు తమ పర్యవేక్షణలో ఉన్నదని, ఎస్సీ ప్రజలనూ ఆ ఆలయంలోకి ప్రవేశించడానికి అనుమతించాలని తెలిపింది.
Also Read: మహారాష్ట్ర మంత్రి ముఖంపై ఇంక్ దాడి.. అంబేద్కర్, ఫూలేలపై కామెంట్లతో ఆగ్రహం!(వీడియో)
ఈ ఆదేశాల తర్వాత తొలిసారి సోమవారంనాడు వైకుంఠ ఏకాదశి రోజున గ్రామంలోని దళితులు అధికారులతోపాటు ఆలయ ప్రవేశం గావించారు.
ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోవద్దని 300 మంది పోలీసు బలగాలను మోహరించారు. ఎంతో భక్తి ప్రపత్తులతో దళితులు మేళ తాళాలతో ఆలయంలోకి వచ్చారు.
తమిళనాడులో ఇది గత పది రోజుల్లో రెండో ఘటన. దీనికి ముందు వెంగైవాయల్ గ్రామంలో పుదుకొట్టై కలెక్టర్ కవిత రాము, ఇతర అధికారుల సహాయంతో అయ్యనార్ ఆలయంలోకి దళితులను ఎస్కార్ట్ చేసుకుని తీసుకెళ్లారు