భార్య కిడ్నాప్.. మనస్తాపంతో సూసైడ్ నోట్ రాసి పెట్టి భర్త ఆత్మహత్య...

By AN TeluguFirst Published Aug 11, 2021, 4:34 PM IST
Highlights

పంజాబ్ లో ఓ దళిత వివాహిత కిడ్నాప్ కు గురైంది. ఆ విషయం ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆ భర్త సూసైడ్ నోట్ రాసి పెట్టి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. 

చంఢీఘర్ : పంజాబ్ లో దారుణ ఘటన జరిగింది. ఓ మహిళను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆమె వివాహిత, పిల్లలు కూడా ఉన్నారు. అయితే దీని మీద ఫిర్యాదు చేయడానికి వెళ్లిన భర్తను పోలీసులు పట్టించుకోలేదు. ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ చుట్టు తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో మనస్తాపం చెందిన ఆ భర్త తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. 

అది ఆ కుటుంబంలో మరో విషాదానికి దారి తీసింది. ఓ వైపు తల్లి కనిపించకుండా పోయిందన్న వేదన, మరో వైపు తండ్రి దూరమవ్వడంతో పిల్లలు అనాథలుగా మారిపోయారు. ఈ ఘటన పూర్వపరాలు ఇలా ఉన్నాయి. 

పంజాబ్ లో విషాదం చోటుచేసుకుంది. తన భార్యను నలుగురు దుండగులు కిడ్నాప్ చేశారని మనోవేదనతో సదరు వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల ప్రకారం.. మక్త్‌సర్‌ గ్రామ పరిధిలో 39 యేళ్ల ఓ దళిత వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవించేవాడు.  అతను కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ రోజు తన భార్య కిడ్నాప్‌కు గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

అయితే, సమయం గడుస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో..  పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోవడం లేదని  మనస్తాపంతో మంగళవారంనాడు సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  ఆ సూసైడ్ నోట్ లో ఆ దళిత వ్యక్తి తన భార్యను కిడ్నాప్ చేసిన వ్యవహారంలో నలుగురిపై అనుమానం ఉన్నట్లు ఆ లేఖలో పేర్కొన్నాడు. 

అతను చనిపోయిన తరువాత కుటుంబ సభ్యుల సమాచారం మేరకు లఖేవాలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ సంఘటనమీద స్పందించిన లఖేవాలి పోలీసు అధికారి శిమ్లారాని కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ కేసు విషయంలో పోలీసులు అలసత్వంగా ఉన్నారని, తండి ఫిర్యాదును పట్టించుకోలేదని ఆ కారణంగా తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నారని మృతుని కూతురు ఆరోపించింది.

 ఆ తర్వాత తన తండ్రి ఆత్మహత్యపై.. జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ (ఎన్‌సీఎస్‌సీ)కు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన కమిషనర్ అధికారులు పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాగా, దీనిపై 15 రోజుల్లో పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పంజాబ్‌ డిప్యూటీ కమిషనర్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులను ఆదేశించారు. 

click me!