వృద్ధుడి కోసం నీళ్లు అడిగినందుకు దళితుడిపై దాడి.. పోలీసులకు ఫిర్యాదు.. మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య

By team teluguFirst Published Dec 29, 2022, 9:25 AM IST
Highlights

తమిళనాడులో దారుణం వెలుగులోకి వచ్చింది. రోడ్డుపై పడిపోయిన వృద్ధుడి కోసం నీళ్లు తీసుకొచ్చేందుకు ఓ దళిత యువకుడు ఉన్నత కులానికి చెందిన వ్యక్తి ఇంటికి వెళ్లాడు. దీంతో ఆ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు యువకుడిపై దాడి చేసి పోలీసులకు అప్పగించారు. అవమానభారాన్ని భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఎన్నో రంగాల్లో దేశం పురోగతి సాధిస్తున్నా.. ఇంకా సమాజంలో సంకుచిత మనస్తత్వం చావడం లేదు. కుల, మత భావాలు చెదిరిపోవడం లేదు. కుల, మతాల పేరుతో గొడవలు జరుగుతున్నాయి. దాడులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధుడి కోసం నీళ్లు అడిగేందుకు అగ్రవర్ణాల ఇంటికి వెళ్లిన ఆ దళిత యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. అతడిని ఘోరంగా అవమానించి, దాడి చేసి అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ అవమాన భారంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.

వార్నీ.. ప్రేయసితో పారిపోయేందుకు ఓ వ్యక్తిని చంపి.. తానేనని నమ్మించాలని.. ఓ వృద్ధుడి మాస్టర్ ప్లాన్..

ఈ ఘటన తమిళనాడు వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. పలు వార్తా కథనాల నివేదికల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. విల్లుపురం జిల్లా కేంద్రానికి చెందిన దళిత యువకుడు రాజా (20) పని నిమిత్తం నగరంలో తిరుగుతున్నాడు. ఈ క్రమంలో రోడ్డు పక్కన ఓ వృద్ధుడు అస్వస్థకు గురై పడిపోయి ఉన్నాడు. తనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని, తాగేందుకు నీళ్లు తీసుకురావాలని రాజాను అభ్యర్థించాడు. దీంతో ఆ యువకుడు చలించిపోయాడు. ఎలాగైనా వృద్ధుడికి నీళ్లు అందించాలనే తాపత్రయంతో సమీపంలో ఉన్న ఓ ఇంటికి వెళ్లాడు.

ఇక పాత ఛార్జర్ లకు గుడ్ బై... భారత్ లో మార్చి 2025 నుండి యూఎస్ బీ టైప్-సి ఛార్జింగ్‌ తప్పనిసరి..

ఆ ఇల్లు ఆధిపత్య వన్నియార్ వర్గానికి చెందిన మూర్తి అనే వ్యక్తికి చెందినది. ఆ ఇంటి తలుపులు తట్టి తనకు నీళ్ల కావాలని, వృద్ధుడి పరిస్థితిని వివరించాడు. కానీ తన ఇంటికి వచ్చింది ఓ దళిత యువకుడు అని మూర్తికి అర్థమైంది. ఈ విషయం అతడికి ఆగ్రహం తెప్పించిందని ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ ఓ కథనంలో పేర్కొంది. దీంతో రాజాను మూర్తి తీవ్రంగా దూషించాడు. ఓ గ్యాంగ్ ను పిలిపించి దళిత యువకుడిపై నిర్దాక్షిణ్యంగా దాడి చేశాడు. 

దొంగల చేతిలో జార్ఖండ్‌ నటి హతం.. చోరీని ప్రతిఘటించడంతో కాల్పులు!

కొంత సమయంలో తరువాత వన్నియార్ వర్గానికి చెందిన వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడి చేరుకున్న తరువాత రాజాపై తప్పుడు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కూడా అగ్రవర్ణాల పక్షాన నిలిచారని పలు కథనాలు పేర్కొన్నాయి. వారు రాజాను స్టేషన్ కు తీసుకెళ్లి కస్టడీలో హింసించారని ఆరోపణలు వచ్చాయి. 

2021లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఎంత మంది మరణించారు? ఎన్ హెచ్ఏఐ రిపోర్టు ఏం చెప్పుతోంది..?

వన్నియార్ కుటుంబాలు నివసించే వీధిలోకి ప్రవేశించాలని రాజా తీసుకున్న నిర్ణయంతో అగ్రకులాల సమాజం ఆగ్రహంతో ఉందని ఓ దినపత్రిక పేర్కొంది. అయితే నిస్వార్థంగా సాయం చేసేందుకు ప్రయత్నించిన  వృద్ధుడు కూడా ఆధిపత్య కులానికి చెందినవాడే గమనార్హం. కాగా.. తన జరిగిన అన్యాయం, అవమానం పట్ల రాజా తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. పోలీసు స్టేషన్ నుంచి విడుదలై ఇంటికి చేరుకున్న తరువాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై  తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

click me!