దొంగతనం చేశాడనే ఆరోపణలతో దళిత బాలుడిని పోల్‌కు కట్టి కొట్టారు.. కేసు నమోదు

By Mahesh KFirst Published Oct 2, 2022, 8:58 PM IST
Highlights

బెంగళూరులో ఓ నాలుగేళ్ల బాలిక చెవి రింగ్‌ను దొంగిలించాడనే అభియోగంతో ఓ దళిత బాలుడిని కరెంట్ స్తంభానికి కట్టేసి దాడి చేశారు. ఆపడానికి వెళ్లిన తల్లిని కూడా కొట్టారు. వారికి చికిత్స అందుతున్నది. పోలీసులు పది మంది నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
 

బెంగళూరు: కర్ణాటకలో దొంగతనం చేశాడనే అభియోగంతో ఓ దళిత బాలుడిని ఎలక్ట్రిక్ పోల్‌కు కట్టేసి కొట్టారు. మధ్యలో కలుగజేసుకోవడానికి వెళ్లిన తల్లి పై కూడా వారు దాడి చేశారు. తల్లీ కొడుకు ఇద్దరికీ గాయాలు అయ్యాయి. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, వారి ఇద్దరికీ గాయాలు అయ్యాయని, కానీ, ప్రమాదమేమీ లేదని పోలసీులు చెప్పారు.

ఈ ఘటన సెప్టెంబర్ 29వ తేదీన బెంగళూరు సమీపంలో చోటుచేసుకుంది. దళిత కమ్యూనిటీకి చెందిన యశ్వంత్ అనే మైనర్‌ను ఓ కరెంట్ స్తంభానికి కట్టేసి ఉన్నత కులాల వ్యక్తులు కొందరు కొట్టారు. ఓ ఇయర్ రింగ్‌ను చోరీ చేశాడనే ఆరోపణలతో బాలుడిపై దాడి చేశారు.

‘నా కొడుకు మరికొందరు బాల బాలికలతో కలిసి ఆడుకున్నాడు. అందులో ఒకరి చెవి రింగ్‌ను నా కొడుకు దొంగించాడని వాళ్లు అంటున్నారు. మా కులం మొత్తన్నే అంతమొందించాలని కూడా వాళ్లు అన్నారు’ అని బాధిత బాలుడి తల్లి పేర్కొంది.

నిందితులపై ఎస్సీఎస్టీ యాక్ట్, ఇతర సంబంధిత ఐపీసీ సెక్షన్‌ల కింద కేసు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎఫ్ఐఆర్‌లో పది మంది పేర్లను పేర్కొన్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు. ముగ్గురిని జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నామని చెప్పారు. మిగతా వారు మిస్సింగ్ అని, వారి కోసం గాలింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు. నాలుగేళ్ల బాలిక చెవి రింగ్‌ను బాలుడు దొంగిలించినట్టు స్థానికులు చెబుతున్నారని పోలీసు అధికారి తెలిపారు. దర్యాప్తు కొనసాగుతున్నదని చెప్పారు.

click me!