బుద్ధగయాలో పర్యటిస్తున్న దలైలామా.. చైనా మహిళ కోసం పోలీసుల వేట.. ఆమెతో ముప్పు?

By Mahesh KFirst Published Dec 29, 2022, 2:39 PM IST
Highlights

దలై లామా గత వారం బిహార్‌లోని బుద్ధ గయాకు వచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఓ చైనా మహిళ కోసం గాలింపులు జరుపుతున్నారు. ఆమె ద్వారా లామాకు ముప్పు ఉందనే అనుమానాలు ఉన్నాయి. ఆ మహిళ ఊహాచిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు.
 

న్యూఢిల్లీ: బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా బిహార్‌లోని బుద్ధగయాలో పర్యటిస్తున్నారు. ఆయన గత గురువారం ఇక్కడకు వచ్చారు. మూడు రోజుల పాటు ఇక్కడ పర్యటించనున్నారు. దలైలామా పర్యటన నేపథ్యంలో పోలీసులు ఓ సెక్యూరిటీ అలర్ట్ ఇచ్చారు. వారు ఓ చైనా మహిళ కోసం గాలిస్తున్నారు. ఆమె ద్వారా టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ముప్పు పొంచి ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఆ మహిళను పట్టుకోవడంలో భాగంగా ఓ ఊహా చిత్రాన్ని కూడా విడుదల చేశారు. 

ఆ చైనా మహిళను సోంగ్ షియాలన్‌గా పేర్కొన్నారు. ఆమె వివరాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో బౌద్ధ ఆలయాలు, ఆరామాలకు వెళ్లుతున్న భక్తులను పోలీసులు తనిఖీ చేస్తున్నారు.

బుద్ధ గయాకు దలైలామా గత వారం వచ్చారు. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లు ఆయన బుద్ధ గయాకు రాలేదు. ప్రతి యేటా బుద్ధ గయా సందర్శనను ఆయన తాజాగా మళ్లీ పున:ప్రారంభించారు. రెండేళ్ల తర్వాత ఆయన మళ్లీ బుద్ధ గయాకు వచ్చారు.

Also Read: Indian Policy On Dalai Lama:"దలైలామా మా అతిథి.." చైనాకు ధీటుగా స‌మాధానమిచ్చిన‌ భారత్

గయా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో జిల్లా మెజిస్ట్రేట్ త్యాగరాజన్, ఎస్ఎస్‌పీ హర్‌ప్రీత్ కౌర్ సహా ఇతర బౌద్ధ భిక్షవులు లామాకు స్వాగతం పలికారు.

గయాలో లామా ఉన్నంతకాలం పటిష్టమైన భద్రత ఏర్పాట్లను పోలీసులు చేశారు. 2018 జనవరిలో ఇక్కడ పేలుడు జరిగిన సందర్భంలో పటిష్టమైన భద్రత ఇస్తున్నారు. కాగా, కరోనా నివారణ పైనా చర్యలు తీసుకుంటున్నారు. విదేశాల నుంచి ఇక్కడకు వస్తున్నవారందరికీ కరోనా టెస్టులు చేస్తున్నారు.

click me!