Dalai Lama birthday: దలైలామా 87వ పుట్టినరోజు.. ప్రధాని మోడీ శుభాకాంక్షలు

Published : Jul 06, 2022, 02:06 PM IST
Dalai Lama birthday: దలైలామా 87వ పుట్టినరోజు.. ప్రధాని మోడీ శుభాకాంక్షలు

సారాంశం

Dalai Lama birthday: ప్ర‌ముఖ బౌద్ధ‌మ‌త గురువు, ఆధ్యాత్మికవేత్త అయిన ద‌లైలామా 87వ పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స‌హా అనేక మంది ప్ర‌ముఖులు ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.   

PM Modi wishes Dalai Lama on his birthday: ప్ర‌ముఖ ఆధ్యాత్మిక నాయ‌కుడు, టిబెట్‌లో అతిపెద్ద  బౌద్ధ‌మ‌త‌ గురువు, ప్ర‌పంచ శాంతికోసం పోరాటం సాగిస్తున్న ద‌లైలామా నేడు త‌న 87వ పుట్టిన రోజును జ‌రుపుకుంటున్నారు. 14 వ దలైలామా టెన్జిన్ గయాట్సో పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్ర‌ముఖులు ఆయ‌న‌కు బ‌ర్త్ డే విషెస్ చెబుతున్నారు.  హాలీవుడ్ స్టార్ రిచర్డ్ గేర్.. సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ (CTA) అధిపతి అయిన పెన్పా త్సెరింగ్‌తో కలిసి ధర్మశాలలో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో "హ్యాపీ బర్త్‌డే" సాంగ్స్  గ్రీటింగ్స్ మ‌ధ్య పుట్టినరోజు కేక్ కట్ చేశారు.

దలైలామా జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తూ ఆధ్యాత్మిక నాయకుడు టిబెటన్ సంస్కృతిని కాపాడారని, సమస్యల పరిష్కారానికి అహింస మార్గంలో ముందుకు సాగుతున్నార‌ని అన్నారు. 

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కూడా ద‌లైలామాకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆయ‌న ఆరోగ్యం జీవించాల‌ని ప్రార్థిస్తున్నాని ట్వీట్ చేశారు. “ఈరోజు ముందుగా ఫోన్‌లో ప‌విత్ర‌హృద‌యులైన‌ దలైలామాకు 87వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాను. ఆయన దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాం' అని ప్ర‌ధాని మోడీ ట్వీట్  చేశారు. 


దలైలామా పుట్టినరోజు సందర్భంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ తో పాటు అనేక మంది ప్ర‌ముఖులు ఆయ‌న‌కు శుభాకాంక్షలు తెలిపారు. హ‌ర్దీప్ సింగ్ పూరీ.. దలైలామాను "భారతదేశానికి చిరకాల మిత్రుడు..కరుణకు బోధిసత్వ" అని అభివర్ణించారు.  "ప్రపంచ శాంతి, అహింస కోసం అతని తపన మానవాళికి ప్రేరణ" అని ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

8th Pay Commission : మినిమం శాలరీనే రూ.18,000 నుండి రూ.51,000 పెంపు.. ఈ స్థాయిలో జీతాలు పెరుగుతాయా..?
Devta Chhatrakhand Panchveer: హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో న్యూ ఇయర్ వేడుకలు| Asianet News Telugu