ధమ్రా వద్ద తీరాన్ని తాకిన యాస్ తుఫాన్: ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు

By narsimha lodeFirst Published May 26, 2021, 9:42 AM IST
Highlights

యాస్ తుపాన్ ఒడిశా రాష్ట్రంలోని  భద్రక్ జిల్లాలోని ధమ్రా పోర్టు సమీపంలో బుధవారం నాడు ఉదయం తీరాన్ని తాకింది.

న్యూఢిల్లీ: యాస్ తుపాన్ ఒడిశా రాష్ట్రంలోని  భద్రక్ జిల్లాలోని ధమ్రా పోర్టు సమీపంలో బుధవారం నాడు ఉదయం తీరాన్ని తాకింది.ఇవాళ మధ్యాహ్నం తర్వాత బాలాసోర్-ధమ్రా పోర్టు మధ్య తీరం దాటనుంది. ఒడిశాలోని 9 జిల్లాల్లో దీని ప్రభావం ఉంటుందని వాతావరణశాఖాధికారులు హెచ్చరించారు.  ఈ 9 జిల్లాల్లో రెడ్ వార్నింగ్ జారీ చేసింది వాతావరణశాఖ.దమ్రా పోర్టులో పదో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 

also read:దూసుకొస్తున్న యాస్ తుఫాన్: బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో హైఅలెర్ట్
  
బెంగాల్ రాష్ట్రంలోని  కోస్టల్ ప్రాంతంతో పాటు ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.  ఈ భారీ వర్షాలను పురస్కరించుకొని  సుమారు 12 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకొన్నాయి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది  సహాయక చర్యలను చేపట్టారు. నేవీ సిబ్బంది కూడ రంగంలోకి దిగారు.బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మత్స్యకారులు ఎవరూ కూడ చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. 

ఈ తుఫాన్ కారణంగా  24 పరగణాల జిల్లాల్లో 80 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇద్దరు విద్యుత్ షాక్ తో మరణించారు.  తుపాన్ ప్రభావంతో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. తుఫాన్ కారణంగా సుమారు 20 సెం.మీ పై గా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తుపాన్ ప్రభావిత గ్రామాల ప్రజలకు రిలీఫ్ మెటిరీయల్ ను ఇండియన్ నేవీ సిబ్బంది అందిస్తున్నారు. ఒడిశా రాష్ట్రంలోని పలు గ్రామాల్లో నేవీ బృందం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.తుపాన్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో ఇటీవలనే ప్రధాని  మోడీ మాట్లాడారు.  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడ ఆయా సీఎంలతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. 

click me!