Cyclone Tej : రేపు తీవ్ర తుపానుగా మారనున్న ‘తేజ్’.. ఏ రాష్ట్రాలపై ప్రభావం చూపనుందంటే ?

అరేబియా సముద్రంలో ఏర్పడిన తేజ్ తుఫాన్ ఆదివారం తీవ్ర తుఫాన్ గా మారనుందని భారత వాతవరణ కేంద్రం (ఐఎండీ) అంచనా వేసింది. ఇదే సముద్రంలో ఈ ఏడాది జూన్ లో ఏర్పడిన తుఫాన్ గుజరాత్ పై తీవ్ర ప్రభావం చూపింది. 
 

Cyclone Tej: 'Tej' which will become a severe storm tomorrow.. which states will it affect?..ISR

Cyclone Tej: అరేబియా సముద్రంలో ఏర్పడిన 'తేజ్' నేడు (శనివారం) తుఫానుగా మారుతోందని.. అది ఆదివారం నాటికి 'తీవ్ర తుఫాను'గా మారనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. గంటకు గరిష్టంగా 62-88 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. అయితే గరిష్ఠ గాలుల వేగం గంటకు 89-117 కిలోమీటర్లకు చేరితే దాన్ని తీవ్ర తుఫానుగా పరిగణించనున్నారు.

ఆగ్నేయ, దానిని ఆనుకుని ఉన్న నైరుతి అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రేపు తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ శుక్రవారం ప్రకటించింది. కాగా.. ఈ తుఫాను గుజరాత్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాకపోతే తుఫాను పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నందున గుజరాత్ (తూర్పున ఉన్న ప్రాంతం)పై ఎలాంటి ప్రభావం చూపకపోవచ్చని ఐఎండీ అంచనా వేసింది.

Latest Videos

తుపాను గుజరాత్ వైపు పయనిస్తున్నందున ప్రస్తుతానికి ఎలాంటి ముప్పు లేదని, ఇక్కడ రాబోయే ఏడు రోజుల పాటు వాతావరణం పొడిగానే ఉంటుందని రాష్ట్ర సహాయ కమిషనర్ అలోక్ కుమార్ పాండే తెలిపారు. కాగా.. ఈ ఏడాది జూన్ లో అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుఫాను గుజరాత్ లోని కచ్, సౌరాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను అతలాకుతలం చేసింది. తొలుత పశ్చిమ దిశగా పయనించిన ఇది ఆ తర్వాత దిశ మార్చుకుని కచ్ లో తీరం దాటింది.

అరేబియా సముద్రంలో ఈ ఏడాది ఏర్పడిన రెండో తుఫాను ఇది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో తుఫానులకు పేర్లు పెట్టడానికి అనుసరిస్తున్న ఫార్ములా ప్రకారం దీనికి 'తేజ్' అని నామకరణం చేశారు. ఈ తుఫాను ఆదివారం మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారి ఒమన్, దానిని ఆనుకుని ఉన్న యెమెన్ దక్షిణ తీరాల వైపు కదులుతుందని ఐఎండీ తెలిపింది.

అయితే జూన్ లో అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుఫాను మొదట్లో ఉత్తర వాయవ్య దిశలో ప్రయాణించి గుజరాత్ లోని మాండ్వి, పాకిస్తాన్ లోని కరాచీ మధ్య తీరం దాటే ముందు కొన్నిసార్లు తుపానులు అంచనా వేసిన ట్రాక్, తీవ్రతకు భిన్నంగా ఉంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది అక్టోబర్ 22 సాయంత్రానికి తీవ్ర తుఫానుగా మారి దక్షిణ ఒమన్, యెమెన్ తీరం వైపు కదులుతుందని అహ్మదాబాద్ లోని వాతావరణ కేంద్రం డైరెక్టర్ మనోరమ మొహంతి తెలిపారు. కాగా.. నైరుతి, పశ్చిమ మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో నేడు (అక్టోబర్ 21) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, 23న తుఫానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

vuukle one pixel image
click me!