టౌటే తుఫాన్: గుజరాత్‌లో ఏరియల్ సర్వే నిర్వహించిన మోడీ

By narsimha lodeFirst Published May 19, 2021, 4:03 PM IST
Highlights

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టౌటే తుఫాన్  ప్రభావంతో గుజరాత్ రాష్ట్రంలో దెబ్బతిన్న ప్రాంతాల్లో  బుధవారం నాడు  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏరియల్ సర్వే నిర్వహించారు. 

గాంధీనగర్:ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టౌటే తుఫాన్  ప్రభావంతో గుజరాత్ రాష్ట్రంలో దెబ్బతిన్న ప్రాంతాల్లో  బుధవారం నాడు  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏరియల్ సర్వే నిర్వహించారు. గుజరాత్ రాష్ట్రంలో టౌటే తుఫాన్ తీవ్ర విధ్వంసం సృష్టించింది. గుజరాత్‌తో సహా మరో ఐదు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపింది. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో ప్రధాని మోడీకి గుజరాత్ సీఎం విజయ్ రూపానీ స్వాగతం పలికారు. ఏరియల్ సర్వే తర్వాత తుఫాన్ పై ప్రధాని సమీక్ష నిర్వహిస్తారు. 

also read:టౌటే ఎఫెక్ట్: 14 మంది మృతి,ఆరు రాష్ట్రాల్లో జోరు వానలు

1998 తర్వాత గుజరాత్ రాష్ట్రంలో తీవ్ర ప్రభావం చూపిన తుఫాన్ గా టౌటే రికార్డు సృష్టించింది.  దీని కారణంగా రాష్ట్రంలోని తీర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విద్యుత్ స్థంబాలు, సెల్ టవర్లు, చెట్లు కూలిపోయాయి. ఇల్లు, రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ తుఫాన్ ఉత్తర్‌ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో కొంత ప్రభావం చూపింది. దీంతో ఇవాళ వర్షాలు కురిశాయి. టౌటే తుఫాన్ తో కేరళ, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రల్లో వర్షాలు కురిశాయి., 

 

click me!