"ఫణి" రాకముందే: ఈదురుగాలులకు వణికిన కేరళ, రెడ్ అలర్ట్ జారీ,

By Siva KodatiFirst Published Apr 26, 2019, 10:46 AM IST
Highlights

భారీ ఈదురుగాలులు కేరళలో బీభత్సం సృష్టించాయి. బుధవారం రాత్రి ఎర్నాకులంలో బలంగా వీచిన గాలుల ధాటికి జనం వణికిపోయారు. అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకూలగా.. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవడంతో పాటు కిటికీలు ధ్వంసమయ్యాయి

భారీ ఈదురుగాలులు కేరళలో బీభత్సం సృష్టించాయి. బుధవారం రాత్రి ఎర్నాకులంలో బలంగా వీచిన గాలుల ధాటికి జనం వణికిపోయారు. అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకూలగా.. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవడంతో పాటు కిటికీలు ధ్వంసమయ్యాయి.

కరెంట్ వైర్లు తెగిపోవడంతో జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో విద్యుత్ శాఖ ఉద్యోగులు కరెంట్ పునరుద్దరుణ కోసం రాత్రి నుంచి శ్రమిస్తున్నారు.

దీనిపై కేరళ విద్యుత్ శాఖకు చెందిన ఉన్నతాధికారి మాట్లాడుతూ.. కరెంట్ పునరుద్దరణ పనులను ఆరుగురు కాంట్రాక్టర్లకు అప్పగించామని... వీరు యుద్ధప్రాతిపదికన విద్యుత్ స్థంభాలను అమరుస్తున్నారని.. శుక్రవారం సాయంత్రం నాటికి విద్యుత్ సరఫరాను పునరుద్దరిస్తామని తెలిపారు.

ఎర్నాకులం జిల్లాలోని ఎలమక్కర, ఈడపల్లి, చిత్తూర్, చేరనెల్లూరు, వధూతల, కోచ్చితో పాటు పరవూర్‌లలో ఈదురుగాలులు విధ్వంసం సృష్టించాయి. వందలాది ఎకరాల్లో కొబ్బరి పంటకు నష్టం వాటిల్లింది.

మరోవైపు ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన ఫణి తుఫాను తరుముకొస్తున్న నేపథ్యంలో ఎర్నాకులం జిల్లాలో ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. దీంతో పాటు జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

జిల్లా కేంద్రాల్లో అత్యవసర విభాగాన్ని ఏర్పాటు చేయాలని, విద్యుత్, టెలిఫోన్ లైన్లకు ఏమైనా నష్టం వాటిల్లితే వెంటనే దానిని పునరుద్దరించేందుకు సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని హెచ్చరించింది. 
 

click me!