మోడీ సర్కార్‌పై వ్యాఖ్యలు: రాహుల్‌కు ఈసీ నోటీసులు

Published : May 02, 2019, 11:33 AM IST
మోడీ సర్కార్‌పై వ్యాఖ్యలు: రాహుల్‌కు ఈసీ నోటీసులు

సారాంశం

చౌకీదారు వివాదం విషయంలో   కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీపై  సుప్రీంకోర్టు సీరియస్ అయిన ఘటన మరువక ముందే ఈసీ కూడ రాహుల్‌కు నోటీసులు జారీ చేసింది.  మోడీ ప్రభుత్వంపై రాహుల్ చేసిన వ్యాఖ్యల విషయంలో ఈసీ ఈ నోటీసులను గురువారం నాడు  జారీ చేసింది.ః  

న్యూఢిల్లీ: చౌకీదారు వివాదం విషయంలో   కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీపై  సుప్రీంకోర్టు సీరియస్ అయిన ఘటన మరువక ముందే ఈసీ కూడ రాహుల్‌కు నోటీసులు జారీ చేసింది.  మోడీ ప్రభుత్వంపై రాహుల్ చేసిన వ్యాఖ్యల విషయంలో ఈసీ ఈ నోటీసులను గురువారం నాడు  జారీ చేసింది.ః

 గిరిజనులను కాల్చిపారేసేలా  మోడీ సర్కార్ కొత్త చట్టాన్ని తీసుకురానుందని  రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు.  ఈ వ్యాఖ్యలపై  ఈసీ షోకాజ్  నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని  ఈసీ ఆదేశించింది. లేకపోతే  చర్యలు తీసుకొంటామని  ఈసీ చెప్పింది.

ఈ ఏడాది ఏప్రిల్ 23వ తేదీన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షాదో‌ల్‌లో  ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ గాంధీ  బీజేపీ సర్కార్ ‌పై విమర్శలు చేశారు. గిరిజను కోసం మోడీ తీసుకొచ్చే చట్టం గురించి   ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

గిరిజనులను కాల్చిపారేసేలా పోలీసులకు అనుమతి కల్పిస్తూ ఈ చట్టాన్ని రూపొందిస్తున్నారని రాహుల్  ఈ సభలో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ కార్యకర్తలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఈసీ ఈ మేరకు గురువారం నాడు రాహుల్‌కు నోటీసులు జారీ చేసింది.

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu