తీవ్రరూపంలో 'బిపర్జోయ్ తుఫాన్'.. ఐఎండీ హెచ్చ‌రిక‌లు

By Mahesh RajamoniFirst Published Jun 10, 2023, 9:31 AM IST
Highlights

New Delhi: బిపర్జోయ్ తుఫానుకు ముందు గుజరాత్ తీరంలోని వల్సాద్ లోని తిథాల్ బీచ్ వద్ద అలలు భారీగా ఎగిసిప‌డుతున్నాయి. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో వల్సాద్ యంత్రాంగం ముందుజాగ్రత్త చర్యగా టిథాల్ బీచ్ ను పర్యాటకుల కోసం మూసివేసింది. స‌ముద్రంలో ఉన్న‌ గుజరాత్ మత్స్యకారులను తీరానికి పిలిపించారు. అరేబియా సముద్రంలో తుఫాను ప్రభావిత ప్రాంతాలకు మత్స్యకారులు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. 
 

Cyclone Biparjoy: బిపర్జోయ్ తుఫానుకు ముందు గుజరాత్ తీరంలోని వల్సాద్ లోని తిథాల్ బీచ్ వద్ద అలలు భారీగా ఎగిసిప‌డుతున్నాయి. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో వల్సాద్ యంత్రాంగం ముందుజాగ్రత్త చర్యగా టిథాల్ బీచ్ ను పర్యాటకుల కోసం మూసివేసింది. తుఫాను దృష్ట్యా స‌ముద్రంలో ఉన్న‌ గుజరాత్ మత్స్యకారులను తీరానికి పిలిపించారు. అరేబియా సముద్రంలో తుఫాను ప్రభావిత ప్రాంతాలకు మత్స్యకారులు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.

వివ‌రాల్లోకెళ్తే.. రానున్న 24 గంటల్లో బిపర్జోయ్ తుఫాను మరింత బలపడి ఉత్తర ఈశాన్య దిశగా కదులుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం తెలిపింది. “చాలా తీవ్రమైన తుఫాను బైపార్జోయ్ జూన్ 9వ తేదీ 23:30 గంటల IST వద్ద తూర్పు-మధ్య అరేబియా సముద్రం మీదుగా 16.0N & పొడవైన 67.4E సమీపంలో ఉంది. రాబోయే 24 గంటల్లో మరింత తీవ్రరూపం దాల్చి.. ఉత్తర-ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉంది” అని ఐఎండీ ఒక ట్వీట్‌లో పేర్కొంది.

బిపర్జోయ్ తుఫాన్ నేపథ్యంలో అరేబియా సముద్ర తీరంలోని వల్సాద్ లోని టిథాల్ బీచ్ వద్ద అలలు ఎగిసిపడుతున్నాయి. ముందుజాగ్రత్త చర్యగా తిథాల్ బీచ్ ను జూన్ 14 వరకు పర్యాటకులకు మూసివేశారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని చెప్పామనీ, వారంతా తిరిగి వచ్చారని సంబంధిత అధికారులు చెప్పారు. అవసరమైతే ప్రజలను సముద్ర తీరంలోని గ్రామాల నుంచి త‌ర‌లిస్తామ‌ని చెప్పారు. వారి కోసం షెల్టర్లు ఏర్పాటు చేసిన విష‌యాలు వెల్ల‌డించారు. జూన్ 14 వరకు పర్యాటకుల కోసం తిథాల్ బీచ్ ను మూసివేస్తున్న‌ట్టు కూడా సంబంధిత అధికారులు పేర్కొన్నారు. 

మ‌రికొన్ని గంటల్లో బిపర్జోయ్ తుఫాన్ తీవ్రరూపం దాల్చే అవకాశం ఉన్నందున కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ తీరంలోని సముద్రాల్లో వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ మత్స్యకారులకు సూచించింది. కేరళలోని తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, కోజికోడ్, కన్నూర్ జిల్లాల్లో శుక్రవారం ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తుఫాను పాకిస్తాన్ వైపు కదులుతోందని భారత వాతావరణ శాఖ తన తాజా బులెటిన్ లో పేర్కొంది. అంతకుముందు జూన్ 9న పాకిస్తాన్ వాతావరణ శాఖ కూడా తమ ప్రాంతంలో కదలికలు, తీరం దాటే అవకాశాలపై ట్విటర్ ద్వారా అప్డేట్ ఇచ్చింది.

click me!