బిపర్జోయ్ తుఫాను బీభ‌త్సం.. గుజ‌రాత్ లో లోతట్టు ప్రాంతాల ప్రజల‌ త‌ర‌లింపు

Published : Jun 12, 2023, 09:36 AM IST
బిపర్జోయ్ తుఫాను బీభ‌త్సం.. గుజ‌రాత్ లో లోతట్టు ప్రాంతాల ప్రజల‌ త‌ర‌లింపు

సారాంశం

cyclone alert: బిపర్జోయ్ తుఫాను అతి తీవ్ర తుఫానుగా అరేబియా సముద్రం తీరంవైపు దూసుకువ‌స్తోంది. గుజరాత్ లో తుఫాను హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను తాత్కాలిక షెల్టర్లకు తరలిస్తున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్ర‌జ‌ల‌కు సూచించారు.   

Cyclone Biparjoy Arabian Sea: బిప‌ర్జోయ్ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో గుజరాత్ లోని కచ్ లోని కాండ్లాలోని దీన్ దయాళ్ పోర్ట్ అథారిటీ అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను తాత్కాలిక షెల్టర్లకు తరలించడం ప్రారంభించారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని కోరారు. గుజరాత్ లోని కాండ్లాలోని దీన్ దయాళ్ పోర్ట్ అథారిటీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఓం ప్రకాశ్ మాట్లాడుతూ ఆరు నౌకలు పోర్టు నుంచి బయలుదేరాయనీ, మరో 11 నౌకలు మంగ‌ళ‌వారం బయలుదేరుతాయని చెప్పారు. సోమ‌వారం ఆరు నౌకలు, మంగ‌ళ‌వారం మరో 11 నౌకలు బయలుదేరనున్నాయి. పోర్టు అధికారులు, నౌకల యజమానులు అప్రమత్తంగా ఉండాలని అధికార వ‌ర్గాలు పేర్కొన్నాయి. కాండ్లాలోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని గాంధీధామ్ లోని తాత్కాలిక షెల్టర్లకు తరలిస్తున్నామని పీఆర్వో తెలిపారు.

గుజరాత్లోని సౌరాష్ట్ర, కచ్ తీరాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తుఫాను హెచ్చరికలు జారీ చేసింది. "సౌరాష్ట్ర-కచ్ తీరానికి తుఫాను హెచ్చరిక  చేస్తూ.. ఎల్లో అల‌ర్ట్ ప్ర‌క‌టించింది. తూర్పు మధ్య, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఉన్న 'బిపర్జోయ్' తుఫాను ఉత్తర దిశగా పయనించి రాబోయే కొన్ని గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంత‌కుముందు తెలిపిందిద‌. తుఫాను కారణంగా ఏర్పడిన ప్రతికూల వాతావరణం, సముద్ర పరిస్థితులు రానున్న మూడు, నాలుగు రోజుల్లో గంటకు 135-145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రాలకు ఈదురుగాలుల హెచ్చరికలు జారీ చేసింది.

ముంబ‌యిపై ప్ర‌భావం.. 

ముంబ‌యి, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి వర్షాలు కురిశాయని ఐఎండీ అధికారులు తెలిపారు. బిపర్జోయ్ తుఫాను తీవ్రత పెరగడంతో ముంబ‌యి నగరంతో పాటు రాష్ట్రంలోని కోస్తా ప్రాంతాల్లో కూడా బలమైన గాలులు వీచాయి. ధూళి కణాల కారణంగా బలమైన గాలులు గాలి నాణ్యత-దృశ్యమానతను కూడా ప్రభావితం చేశాయి. ఈదురుగాలులకు ముంబ‌యిలోని కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయని నగరపాలక సంస్థ అధికారి ఒకరు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?