ఏటీఎంలో మహిళపై అత్యాచారం

Published : Nov 20, 2018, 09:44 AM IST
ఏటీఎంలో మహిళపై అత్యాచారం

సారాంశం

ఏటీఎంలో మనీ డ్రా చేసుకుందామని వచ్చిన మహిళను కిడ్నాప్ చేసి.. అక్కడే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. 

ఏటీఎంలో మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఒడిశా రాష్ట్రం లో చోటుచేసుకుంది. కటక్ సిటీలోని పిలిగ్రిమ్ రోడ్డు సమీపంలోని ఏటీఎంలో ఆదివారం రాత్రి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఏటీఎంలో మనీ డ్రా చేసుకుందామని వచ్చిన మహిళను కిడ్నాప్ చేసి.. అక్కడే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను అక్కడికి సమీపంలోని పొలాల్లో పడేశారు. కాగా.. అచేతనంగా పడిఉన్న మహిళను గుర్తించిన స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

వెంటనే పోలీసులకు కూడా సమాచారం చేరవేశారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.  

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..