కాశ్మీర్ లో ఎన్ కౌంటర్: ఓ జవాను, నలుగురు టెర్రరిస్టులు మృతి

Published : Nov 20, 2018, 09:00 AM IST
కాశ్మీర్ లో ఎన్ కౌంటర్: ఓ జవాను, నలుగురు టెర్రరిస్టులు మృతి

సారాంశం

జమ్మూ కాశ్మీరులో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ జవాను మరణించాడు. నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ముగ్గురు సైనికులు గాయపడ్డారు. ఈ సంఘటన జమ్మూ కాశ్మీరులోని సోపియన్ ప్రాంతంలోని ఓ గ్రామంలో జరిగింది.  

శ్రీనగర్: జమ్మూ కాశ్మీరులో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ జవాను మరణించాడు. నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ముగ్గురు సైనికులు గాయపడ్డారు. ఈ సంఘటన జమ్మూ కాశ్మీరులోని సోపియన్ ప్రాంతంలోని ఓ గ్రామంలో జరిగింది.

రాష్ట్ర పోలీసులు, సిఆర్పీఎఫ్ జవాన్లు, సైనిక బలగాలకు చెందిన పారా ట్రూపర్స్ మంగళవారం ఉదయం నదిగామ్ అనే గ్రామాన్ని చుట్టుముట్టి గాలింపు చర్యలు చేపట్టరు. 

శ్రీనగర్ కు దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో గల ఈ గ్రామంలో తొలుత ఉగ్రవాదులు ప్రభుత్వ బలగాలపై కాల్పులు జరిపారు. ప్రతిగా ప్రభుత్వ బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి.

PREV
click me!

Recommended Stories

Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!
Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే