Shamshabad Airport: అనుమానం వచ్చి చెక్ చేయగా.. భారీ మొత్తంలో బ‌య‌ట‌బడ్డ విదేశీ కరెన్సీ

Published : Feb 15, 2022, 01:00 PM IST
Shamshabad Airport: అనుమానం వచ్చి చెక్ చేయగా.. భారీ మొత్తంలో బ‌య‌ట‌బడ్డ విదేశీ కరెన్సీ

సారాంశం

Shamshabad Airport:అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు కస్టమ్స్ అధికారులు ఎన్నో కఠిన చర్యలు తీసుకుంటున్నా.. కేటుగాళ్ల ఆగ‌డాలు ఆగ‌డం లేదు. తాజాగా  హైదరాబాద్ నగరంలోని శ్రీ రాజీవ్ గాంధీ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ మొత్తంలో విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. సొమాలియా దేశానికి చెందిన ఓ ప్రయాణికుడి వ‌ద్ద‌ 30 లక్షల విలువ చేసే యూఎస్‌ డాలర్స్ ను ఆక్ర‌మంగా త‌ర‌లిస్తుండ‌గా స్వాధీనం చేసుకున్నారు.  

Shamshabad Airport: అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. స్మ‌గ్ల‌ర్లు త‌న క‌న్నింగ్ ఐడియాల‌తో రెచ్చిపోతున్నారు. బూట్లలో బంగారం.. కడుపులో డ్రగ్స్.. వంటి ఐడియాల‌తో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. విదేశాల నుంచి ఖరీదైన వస్తువులు, నగదు తరలిస్తున్నారు. తీరా అధికారులకు దొరికి జైలుపాలవుతున్నారు. ఇటీవల శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇలాంటి ఘటనలు ఎక్కువ అయ్యాయి. బంగారం, విదేశీ కరెన్సీ భారీగానే పట్టుబడుతున్నాయి.

 తాజాగా సొమాలీయ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారుల సోదాల్లో ముప్ఫయి లక్షల విలువ చేసే యూఎస్ డాలర్లు దొరికాయి. 

వివరాల్లోకెళ్తే.. సొమాలీయన్ దేశానికి చెందిన మహమూద్ అలీ అనే వ్యక్తి. హైదరాబాద్ నుంచి షార్జాకు వెళ్లేందుకు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానశ్రయానికి చేరుకున్నాడు. ఈ క్ర‌మంలో ఆయన అమెరికా డాలర్లను తరలించేందుకు ప్రయత్నించాడు. కస్టమ్స్‌ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా యూఎస్‌ డాలర్స్‌ను తన లగేజ్‌ బ్యాగ్‌లో దాచిపెట్టాడు.
  
అయితే మహమూద్‌ అలీ వాలకంపై అనుమానం రావ‌డంతో  సీఐఎస్‌ఎఫ్ ఇంటలిజెన్స్ అధికారులు అతడి లగేజీ బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 30 లక్షల విలువ చేసే యూఎస్‌ డాలర్స్‌ బయటపడ్డాయి.  దీంతో ఈ సొమ్మును అధికారులు సీజ్ చేశారు. మహమ్మద్ అలీని అదుపులోకి తీసుకుని అతనిపై ఫెమా చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న‌ట్టు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.
 

PREV
click me!

Recommended Stories

Delhi dust storm: ఢిల్లీలో ఇసుక తుఫాను బీభత్సం | Massive Sandstorm Hits Delhi-NCR | Asianet Telugu
Vijay vs Udhayanidhi: తమిళనాడు అసెంబ్లీలో రచ్చసీఎం విజయ్ vs ఉదయనిధి | Asianet News Telugu