ఆస్తి కోసం కన్నతండ్రినే కడతేర్చబోయాడు.. ఎయిర్ గన్ తో కాల్పులు జరిపి కొడుకు దారుణం...

Published : Feb 15, 2022, 12:32 PM IST
ఆస్తి కోసం కన్నతండ్రినే కడతేర్చబోయాడు.. ఎయిర్ గన్ తో కాల్పులు జరిపి కొడుకు దారుణం...

సారాంశం

ఆస్తికోసం ఓ కొడుకు అత్యంత దారుణానికి తెగబడ్డాడు. కన్నతండ్రినే హతమార్చడానికి ప్రయత్నించాడు. ఎయిర్ గన్ తో కాల్పులు జరిపి పరారయ్యాడు. అయితే ఈ ఘటనలో తండ్రి ప్రాణాలతో బయటపడ్డాడు. 

మైసూర్ : ఆస్తి కోసం ఓ కొడుకు దారుణానికి తెగబడ్డాడు. Own fatherనే కన్నకొడుకు ఎయిర్ గన్ తో Shot చేసి పరారయ్యాడు. ఈ సంఘటన Mysore విజయ నగర పరిధిలో చోటు చేసుకుంది. Renuka Collegeకు చెందిన శివకుమార్, ఆయన కొడుకు మధ్య కొద్ది రోజులుగా గొడవ జరుగుతోంది. ఆస్తిని తన పేరుమీద రాయాలని తండ్రితో కొడుకు గొడవ పడ్డాడు. తండ్రి వినకపోవడంతో స్నేహితులతో కలిసి Airgun తో కాల్పులు జరిపి పరారయ్యాడు. ఆ శబ్దాలకు చుట్టుపక్కల వారు వచ్చి గాయపడిన శివ కుమార్ ను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కొడుకు మిత్రులు పరారీలో ఉన్నారు.

ఇదిలా ఉండగా, నిరుడు జులైలో ఉత్తరప్రదేశ్ లో ఓ కూతురు ఇలాంటి దారుణానికే తెగబడింది. ప్రేమించినవాడితో పెళ్లికి అంగీకరించలేదని ఓ కూతురు దారుణానికి తెగబడింది. కన్నతండ్రినే అత్యంత దారుణంగా చంపింది. ప్రియుడు, అతని స్నేహితులతో కుమ్మక్కై కన్నతండ్రిని కాటికి పంపింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బరేలీ నగర్లో జరిగింది.

తమ పెళ్లికి తండ్రి అంగీకరించలేదని కోపంతో కుమార్తె తన ప్రియుడితో కలిసి తండ్రిని హతమార్చింది. ఆ తరువాత చెట్టుకు వేలాడదీసింది. బరేలీ లోని స్తంభాల గ్రామానికి చెందిన  హర్పాల్ సింగ్ (46) తన కూతురు ప్రేమ,పెళ్లిని వ్యతిరేకించారు. అంతేకాదు ఆ వివాహం చేసుకుంటే.. తనకు ఉన్న 10 బిగాహాల భూమిని కూడా కుమార్తెకు ఇవ్వడానికి నిరాకరించాడు.

దీంతో పొలానికి వచ్చిన హర్పాల్ సింగ్ కు అతని కుమార్తె ప్రీతి, ప్రియుడు ధర్మేంద్ర యాదవ్,  మరో స్నేహితుడితో కలిసి మద్యం తాగించారు. ఆ తరువాత ఇనుప రాడ్ తో కొట్టారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తరువాత అతన్ని చెట్టుకు వేలాడదీశారు.  

భర్త మరణించిన సంగతి తెలిసిన భార్య.. మృతదేహాన్ని చూడగా.. దానిమీద గాయాల ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కుమార్తె, ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు.  మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. తమ పెళ్లిని వ్యతిరేకించినందువల్లే తండ్రిని చంపామని కుమార్తె ప్రీతి పోలీసులకు చెప్పింది.

ఇదిలా ఉండగా, నిరుడు జూన్ లో ఖమ్మం రూరల్ జిల్లాలోనూ ఇలాంటి దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్నతండ్రినే కుమారుడు హతమార్చిన సంఘటన ఖమ్మం రూరల్ మండలంలోని ఎం.వెంకటాయపాలెంలో బుధవారం కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామనికి చెందిన కొలిచెలం రామ చంద్రయ్య(70)కి ఇద్దరు కుమారులు క్రిష్ణ, ఉమాశంకర్ ఉన్నారు. 

ఉమాశంకర్ భార్యతో గొడవపడటంతో ఆమె నాలుగేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. తన భార్య కాపురానికి రాకపోవడానికి తండ్రే కారణం అంటూ ఉమాశంకర్ నిత్యం గొడవపడుతుండేవాడు. బుధవారం తెల్లవారుజామున కూడా ఇదే విషయమై తండ్రి రాంచంద్రయ్యతో తీవ్రంగా ఘర్షణ పడ్డాడు. అడ్డుకోబోయిన తల్లిని కూడా నెట్టేశాడు. కండువాను తండ్రి మెడకు బిగించి, గొంతు నులిమి, తలను నేలకేసి మోదాడు. అనంతరం పారిపోయాడు. 

పక్కింటివారు వచ్చి చూసే సరికి రాంచంద్రయ్య తీవ్ర రక్తస్రావమై మృతి చెంది ఉన్నాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని మరో కుమారుడు కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐఎంఏ రవూఫ్ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌