తగ్గిన కరోనా కేసులు, మరణాలు.. 53 కోట్లు దాటిన టీకాల పంపిణి...

By AN TeluguFirst Published Aug 14, 2021, 10:11 AM IST
Highlights

మొత్తం కేసుల 3.21 కోట్లకు చేరగా, మరణాలు 4.30 లక్షల మార్కును దాటాయి. ఈ మేరకు శనివారం కేంద్రం ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది. ఇక నిన్న 35 వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. 

ఢిల్లీ : దేశంలో మరోసారి కరోనా కేసులు, మరణాలు స్వల్పంగా క్షీణించాయి. తాజాగా 22,29,793 మందికి కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 38,667 మందికి వైరస్ పాజిటివ్ గా తేలింది. క్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 3.6 శాతం తగ్గుదల కనిపించింది. నిన్న మరో 478 మంది మరణించారు. 

దాంతో మొత్తం కేసుల 3.21 కోట్లకు చేరగా, మరణాలు 4.30 లక్షల మార్కును దాటాయి. ఈ మేరకు శనివారం కేంద్రం ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది. ఇక నిన్న 35 వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. 

అయితే రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా ఉండటం గమనార్హం. క్రియాశీల కేసులు 3,87,673గా ఉండగా, ఆ రేటు 1.21శాతానికి చేరింది. ఇప్పటివరకు వైరస్ ను జయించిన వారి సఖ్య 3,13,38,088(97.45శాతం). మరోపక్క నిన్న 63,80,937 మంది టీకా వేయించుకున్నారు. మొత్తంగా 53 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. 

click me!