అసోం అసెంబ్లీ ఆమోదం.. దేవాలయాల చుట్టూ గోమాంసం అమ్మకాలు నిషేధం...

Published : Aug 14, 2021, 08:41 AM ISTUpdated : Aug 14, 2021, 08:53 AM IST
అసోం అసెంబ్లీ ఆమోదం.. దేవాలయాల చుట్టూ గోమాంసం అమ్మకాలు నిషేధం...

సారాంశం

హిందూ, జైన్, సిక్కులు, ఇతర గోమాంసం తినని సంఘాలు లేదా దేవాలయం, సత్రం మరే ఇతర సంస్థలకు 5 కిమీ పరిధిలో గోమాంసం విక్రయాలకు, పశువధకు ఈ చట్టం అనుమతి నిరాకరిస్తుంది. దీని ప్రకారం ఆయా ప్రాంతాల్లో అలాంటి కార్యక్రమాలు జరగకుండా చూడాలని అధికారులకు సూచించవచ్చు. అయితే, కొన్ని మతపరమైన సందర్భాలలో మినహాయింపులు మంజూరు చేయబడుతుంది.

న్యూఢిల్లీ : అస్సాం అసెంబ్లీ శుక్రవారం  (ఆగస్టు 13, 2021) ఓ ముఖ్యమైన బిల్లును ఆమోదించింది. రాష్ట్రంలోని దేవాలయాల చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో గోమాంసాన్ని విక్రయించడం లేదా వధించడాన్ని నిషేధించే బిల్లును ఆమోదించింది. అస్సాం పశు సంరక్షణ బిల్లు, 2021 చట్టాన్ని సెలెక్ట్ కమిటీకి పంపడానికి ప్రభుత్వం నిరాకరించడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీల వాకౌట్ల మధ్య ఆమోదం పొందింది.

హిందూ, జైన్, సిక్కులు, ఇతర గోమాంసం తినని సంఘాలు లేదా దేవాలయం, సత్రం మరే ఇతర సంస్థలకు 5 కిమీ పరిధిలో గోమాంసం విక్రయాలకు, పశువధకు ఈ చట్టం అనుమతి నిరాకరిస్తుంది. దీని ప్రకారం ఆయా ప్రాంతాల్లో అలాంటి కార్యక్రమాలు జరగకుండా చూడాలని అధికారులకు సూచించవచ్చు. అయితే, కొన్ని మతపరమైన సందర్భాలలో మినహాయింపులు మంజూరు చేయబడుతుంది.

దీంతోపాటు సరైన డాక్యుమెంట్లు లేకుండా రాష్ట్రానికి పశువుల రవాణాను కూడా ఈ బిల్లు ద్వారా తనిఖీ చేయాల్సిందిగా కోరింది. ఈ కొత్త చట్టం ప్రకారం ఇవన్నీ నేరాలుగా పరిగణించబడతాయి. ఇవి నాన్-బెయిలబుల్ నేరాలు. ఈ బిల్లును ఆమోదించినట్లు స్పీకర్ బిశ్వజిత్ డైమరీ ప్రకటించిన వెంటనే అధికార బిజెపి సభ్యులు 'భారత్ మాతా కి జై' ,  'జై శ్రీ రామ్' నినాదాలు చేస్తూ... డెస్క్‌లపై బాదుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

‘ఈ బిల్లు ద్వారా అసోం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న.. పశువుల అక్రమరవాణా, అక్రమ వ్యాపారానికి పెద్ద కుదుపునిస్తుంది. పశువులను పూజించే మన తరాల సంప్రదాయాన్ని కాపాడినట్టు అవుతుంది. మూగజీవాలకు తగిన సంరక్షణ అందిస్తుంది’ అని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు.

"ఈ బిల్లుకు 30 రోజుల మధ్యంతర కాలం ఉంది. దీంట్లో సవరణలను పరిగణనలోకి తీసుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రతిపక్షాలు సరైన వాస్తవాలను గుర్తించలేకపోయాయి. పశువధ నిరోధక బిల్లు 1950 ల చివరలో కాంగ్రెస్ ఇంప్రూవ్ చేసింది తప్ప ఇంకేం చేయలేదు’’ అని శర్మ అన్నారు. 

"ఒక జిల్లానుంచి మరో జిల్లాకు పశువుల రవాణాను నిషేధించాం.  ఒక జిల్లా దాటి పశువుల వధ కోసం మరొక జిల్లాకు వెళ్లలేరు. అలాంటి కార్యకలాపాలకు అనుమతి అవసరం." అయితే  బిల్లు వెనుక ఎలాంటి చెడు ఉద్దేశం లేదని, ఇది మత సామరస్యాన్ని బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. "ఈ చట్టం గొడ్డు మాంసం తినడాన్ని నిషేధించడానికిి ఉద్దేశించలేదు, కానీ అలా తినే వ్యక్తి తప్పనిసరిగా ఇతరుల మత భావాలను కూడా గౌరవించాలి" అని అస్సాం సిఎం అన్నారు.

భలో ముస్లిం ఎమ్మెల్యేలను ప్రస్తావిస్తూ "మీరు ఆవు మాంసం తినడం మానేయాలని నేను కోరుకుంటాను. అలాగని నేను మిమ్మల్ని అడ్డుకోను. మీ హక్కును నేను గౌరవిస్తాను. మనం ఇతరుల మతాలను గౌరవించడం మానేస్తేనే గొడవ మొదలవుతుంది" అని శర్మ అన్నారు.మత సామరస్యాన్ని కాపాడటానికి హిందువులు మాత్రమే బాధ్యత వహించలేరని, ముస్లింలు కూడా ప్రతిస్పందించాలని ఆయన అన్నారు.

ఈ బిల్లును శర్మ జూలై 12 న సభలో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఒక నిర్దిష్ట ప్రాంతంలోని రిజిస్టర్డ్ వెటర్నరీ ఆఫీసర్ జారీ చేసిన అవసరమైన సర్టిఫికెట్ పొందకపోతే పశువధ నిషేధించబడుతుందని పేర్కొంది. పశువైద్యుడు ఆవుకు 14 ఏళ్లు నిండాయని ఆమోదిస్తేనే.. పశువైద్య అధికారి సర్టిఫికెట్ జారీ చేస్తారని ఇది పేర్కొంది. అలాగే, ఆవు, కోడెదూడ లేదా దూడ శాశ్వతంగా అసమర్థంగా ఉంటేనే వధకు అనుమతి ఇస్తారని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌