అంతా కుమ్మక్కై రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్‌లో చీటింగ్! ఐదు నిమిషాల్లో 40 ప్రశ్నలకు సమాధానాలు.. ఐదుగురు అరెస్టు

Published : Apr 15, 2023, 04:54 AM IST
అంతా కుమ్మక్కై రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్‌లో చీటింగ్! ఐదు నిమిషాల్లో 40 ప్రశ్నలకు సమాధానాలు.. ఐదుగురు అరెస్టు

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన పోలీసు రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్‌లో పరీక్ష నిర్వహించిన సంస్థ ఉద్యోగులు, ఇన్‌స్పెక్షన్ అధికారులు, ఎగ్జామ్ సెంటర్ సిబ్బంది కుమ్మక్కై కాపీ చేసే అభ్యర్థులకు సహకరించారు. 2021లో ఈ పరీక్షలు జరిగాయి. రెండు ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.  

లక్నో: ఉత్తరప్రదేశ్ పోలీసు రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్‌లో అంతా కుమ్మక్కై చీటింగ్‌కు సహకరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పరీక్ష నిర్వహించిన సంస్థ ఉద్యోగులు, ఇన్‌స్పెక్షన్ అధికారు, ఎగ్జామ్ సెంటర్ నిర్వాహకులూ కూడబలుక్కుని కొందరు అభ్యర్థులతో డీల్ చేసుకున్నట్టు తెలుస్తున్నది. చీటింగ్ చేయాల్సిన అభ్యర్థికి నిర్దేశించిన కంప్యూటర్ సిస్టమ్ అప్పజెప్పి.. మరొక గదిలో కూర్చుని స్క్రీన్ షేరింగ్ సాఫ్ట్‌వేర్‌తో సమాధానాలు లీక్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ చీటింగ్ వల్లే కొందరు అభ్యర్థులు ఐదు నిమిషాల్లోనే 40 ప్రశ్నలకు సమాధానాలు రాశారని ఓ అధికారి ఫిర్యాదు చేశారు. క్షణాల్లో సమాధానాలు పెట్టడం సాధ్యం కాదని వాదించారు. ఈ కేసులో పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.

2021 నవంబర్, డిసెంబర్ కాలంలో ఎన్‌ఎస్ఈఐటీ యూపీ ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ నిర్వహించంది. ఈ పరీక్ష నిర్వహించిన ఎన్ఎస్ఈఐటీకి చెందిన కొందరు సిబ్బంది కూడా చీటింగ్‌లో భాగస్వామ్యం పంచుకున్నట్టు యూపీ పోలీసు రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డు ఎగ్జామినేషన్‌ సీనియర్ ఉద్యోగి పోలీసులకు రెండు ఫిర్యాదులు చేశారు. ఒకటి 2022, మరొకటి 2023లో ఫిర్యాదులు అందించారు.

కొందరు అభ్యర్థులు 4 నిమిషాల 32 సెకండ్లలో 40 ప్రశ్నలకు సమాధానాలు రాశారని, అంటే 9 సెకండ్లలో ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారని, ఇది సాధ్యం కాదని ఆ ఎఫ్ఐఆర్‌ పేర్కొంది. 

Also Read: UP Encounter: నా కొడుకును ఎన్‌కౌంటర్ చేయడం సరైందే.. మృతదేహాన్ని తీసుకోను: గులాం తల్లి

ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఉత్తమ్ చాంద్ పటేల్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇన్‌స్పెక్షన్ నిర్వహించిన కమిటీ సహా చాలా మంది ఉద్యోగుల పేర్లు ఈ చీటింగ్ కేసులో ముందుకు వచ్చాయి. వీరంతా ఎగ్జామ్ సెంటర్ ఉద్యోగులతో కుమ్మక్కయారు. కాపీ చేయాలనుకున్న అభ్యర్థులకు వీరు అందుకు అవకాశం ఇచ్చారు. మరొక చోట నుంచి ఆపరేట్ చేయగలిగే కంప్యూటర్‌లపై ఆ అభ్యర్థులను కూర్చోబెట్టారు. ఆ క్యాండిడేట్లు సాల్వర్ అనే సాఫ్ట్‌వేర్‌ సహాయంతో ఎగ్జామ్ రాశారు.

యశ్ ఇన్ఫోటెక్ సికంద్ర ఏరియాలో ఓ సెంటర్‌ను స్థాపించుకుంది. దాని అడ్మినిస్ట్రేటర్ యశ్‌పాల్. ఈయన కూడా ఎన్ఎస్ఈఐటీకి చెందిన నిందిత ఉద్యోగులతో కలిసి పని చేశారు.

ఆగ్రా డీసీపీ వికాస్ కుమార్ ప్రకారం, కాపీ చేసిన క్యాండిడేట్ కంప్యూటర్‌లో మాల్‌ఫంక్షన్ ఉన్నట్టు గుర్తించారు. ఎగ్జామ్ సెంటర్‌లో మరో గదిలోని కంప్యూ టర్‌తో లింక్ ఉన్న కంప్యూటర్‌లపైనే కాపీ చేసే అభ్యర్థులను కూర్చోబెట్టారు. ఈ కేసు విషయాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌