క్షణాల్లో ఆవిరైన ఆనందం.. కళ్ల ముందే కన్న కొడుకుని నదిలోకి లాక్కెళ్లిన మొసలి.. 

Published : Jun 14, 2023, 03:41 AM IST
క్షణాల్లో ఆవిరైన ఆనందం.. కళ్ల ముందే కన్న కొడుకుని నదిలోకి లాక్కెళ్లిన మొసలి.. 

సారాంశం

బీహార్‌లోని వైశాలి జిల్లా బిదుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంగా నదిలో స్నానమారిస్తున్న 10 ఏళ్ల బాలుడిని మొసలి ఈడ్చుకెళ్లి.. ముక్కలు ముక్కలుగా కొరికి చంపింది. దీంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు మొసలిని వలలతో బయటకు తీసి కొట్టి చంపారు. ఈ ఘటనతో గ్రామస్తుల్లో భయాందోళన నెలకొంది. 

బీహార్‌లోని హాజీపూర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నదిలో స్నానానికి వెళ్లిన చిన్నారిపై మొసలి దాడికి పాల్పడిన దారుణ ఘటన వెలుగు చూసింది. ఈ ఘటనలో చిన్నారి మృతి చెందాడు. దీంతో కోపోద్రిక్తులైన చిన్నారి బంధువులు, గ్రామస్తులు మొసలిని నదిలో నుంచి బయటకు తీసి కొట్టి చంపారు. ఈ ఘటనతో గ్రామస్తుల్లో భయాందోళన నెలకొంది. ఇకపై  ఒంటరిగా గంగ నది ఒడ్డుకు వెళ్లకూడదని భావిస్తున్నారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిదుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోకుల్ పూర్ నివాసి ధర్మేంద్ర దాస్ మోటార్ సైకిల్ కొనుగోలు చేశాడు. కుటుంబమంతా గంగా నదిలో స్నానమాచరించి, గంగా ఒడ్డున బండికి పూజ చేయాలని భావించారు. ఈ మేరకు గంగా నదిపై ఉన్న ఖాల్సా ఘాట్‌కు చేరుకున్నారు. ధర్మేంద్ర దాస్ కుటుంబం నదిలో స్నానం చేస్తుండగా.. సడెన్ గా అంకిత్ పై ఓ మొసలి దాడి చేసింది. వారి కళ్ల ముందు అకింత్ ను మొసలి నీటిలోకి ఈడ్చుకెళ్లి.. ముక్కులు ముక్కలుగా కొరికి సజీవంగా తినేసింది. 

అంకిత్ మృతదేహం దాదాపు గంట సేపు వెతికి.. బయటకు తీశారు.అంకిత్ మృతి చెందడంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో నది ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటనపై గ్రామస్తులు, బంధువుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవడంతో కోపోద్రిక్తులైన బంధువులు, గ్రామస్తులు నదిలో ఉన్న మొసలిని బయటకు తీసి కర్రలతో కొట్టి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఘటనాస్థలికి చేరుకున్నారు. పోస్టుమార్టం అనంతరం చిన్నారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు బిదుపూర్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సిరాజ్ హుస్సేన్ తెలిపారు. మొసలి మృతదేహాన్ని అటవీశాఖ అధికారులకు అప్పగించారు.

PREV
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu