పెళ్లి కొడుకా మజాకా.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 51 ట్రాక్టర్లతో ఊరేగింపు.. వీడియో వైరల్.. 

Published : Jun 14, 2023, 01:05 AM IST
పెళ్లి కొడుకా మజాకా.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 51 ట్రాక్టర్లతో ఊరేగింపు.. వీడియో వైరల్.. 

సారాంశం

51 ట్రాక్టర్‌లతో ఓ వరుడు బరాత్‌ బయలుదేరాడు. ఏకంగా కిలోమీటరు మేర ట్రాక్టర్ల కాన్వాయ్ సాగింది. వరుడు కూడా స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ చేరుకున్నాడు. రాజస్థాన్‌లోని బార్మర్‌లోని గూడమలానిలో ఘటన జరిగింది. 

రాజస్థాన్‌లో ప్రత్యేకరమైన ఊరేగింపు జరిగింది. ఈ అపూర్వ ఊరేగింపుపై సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. వాస్తవానికి రాజస్థాన్‌లోని బార్మర్‌లోని గూడమలానిలో సోమవారం 51 ట్రాక్టర్లపై ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపు చూడటానికి చాలా గ్రాండ్‌గా ఉంది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వరుడు స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ అత్తమామల ఇంటికి చేరుకున్నాడు. ఊరేగింపు వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.

వివరాల్లోకెళ్తే.. గూడమలానిలోని సగ్రానియోలోని బేరి గ్రామానికి చెందిన ప్రకాష్ చౌదరి, రోలి గ్రామానికి చెందిన మమతను వివాహం చేసుకున్నాడు. సోమవారం ఉదయం 51 ట్రాక్టర్లలో పెళ్లికొడుకు ఇంటికి 15 కిలోమీటర్ల దూరంలోని రోలి గ్రామానికి బయలుదేరారు. 51 ట్రాక్టర్లలో 200లకు పైగా బంధువులు వచ్చారు. పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు క్యూలో ఉండడంతో స్థానికులు  ఆశ్చర్యానికి గురయ్యారు. 

వరుడు ప్రకాష్ చౌదరి మాట్లాడుతూ..మాది వ్యవసాయ కుటుంబం. అందరూ వ్యవసాయం చేస్తారు. రైతు గుర్తింపు ట్రాక్టర్. మా నాన్నగారి ఊరేగింపు కూడా ట్రాక్టర్‌తోనే జరిగిందని, తన పెళ్లి ఊరేగింపును ట్రాక్టర్ల జరుపుకోవాలని నిర్ణయించుకున్ననీ, ఆ మేరకే ట్రాక్టర్లతో ఊరేగింపు సాగుతోందని తెలిపారు. అలాగే.. వరుడి తండ్రి జేతారాం మాట్లాడుతూ..భూమి పుత్రుడికి ట్రాక్టరే హోదా కల్పిస్తుందని అన్నారు. మా నాన్న, తాతయ్యల పెళ్లి ఊరేగింపు ఒంటెలపై జరిగింది. మా కుటుంబంలో ఇప్పటికే 20-30 ట్రాక్టర్లు ఉన్నాయి. నా రైతు స్నేహితులు కలిసి మొత్తం 51 ట్రాక్టర్లతో ఊరేగింపుగా బయలుదేరారని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం