కరోనా సోకి.. డీఎంకే ఎమ్మెల్యే మృతి

Published : Jun 10, 2020, 09:40 AM ISTUpdated : Jun 24, 2020, 11:06 AM IST
కరోనా సోకి.. డీఎంకే ఎమ్మెల్యే మృతి

సారాంశం

ఆ మరుసటి రోజు ఆయన ఆరోగ్యం కుదుట పడటంతో.. అన్భళగన్‌ ఆరోగ్యం కుదట పడ్డట్టేనని సర్వత్రా భావించారు. సోమవారం రాత్రి మరోసారి ఆయన ఆరోగ్యం క్షీణించింది.   

 డీఎంకే ఎమ్మెల్యే అన్భళగన్‌ మృతి చెందారు. కరోనా సోకి ఆయన  ఆరోగ్యం క్షీణించిన సంగతి తెలిసిందే. కాగా... బుధవారం ఉదయం పరిస్థితి మరింత విషమించడంతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే..  చెన్నై చేపాక్కం –ట్రిప్లికేన్‌ నియోజకవర్గ డీఎంకే ఎమ్మెల్యే అన్భళగన్‌. కరోనా నివారణ, సహాయక పనుల్లో ఈయన చాలా యాక్టివ్ గా పాల్గొన్న విషయం తెలిసిందే. కాగా అనుకోకుండా ఆయన  ఈనెల రెండో తేదీన  అనారోగ్యం బారిన పడ్డారు. పరీక్షించగా కరోనా నిర్ధారణ అయ్యింది. ఆయనకు క్రోంపేటలోని రేల ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ మెడికల్‌ సెంటర్‌లో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఐసీయూకు తరలించారు.

సమాచారం తెలుసుకున్న సీఎం పళనిస్వామి ఆస్పత్రి వర్గాలతో మాట్లాడారు. ఆరోగ్య మంత్రి విజయ భాస్కర్‌ ఆస్పత్రికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఆ మరుసటి రోజు ఆయన ఆరోగ్యం కుదుట పడటంతో.. అన్భళగన్‌ ఆరోగ్యం కుదట పడ్డట్టేనని సర్వత్రా భావించారు. సోమవారం రాత్రి మరోసారి ఆయన ఆరోగ్యం క్షీణించింది. 

90 శాతం మేరకు వెంటిలేటర్‌ ద్వారా ఆయనకు శ్వాస అందిస్తున్నారు. ఆయనకు ఇది వరకు బీపీ, కిడ్నీ సమస్యలుండడంతో ప్రస్తుతం 24 గంటల అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఆయన ఆరోగ్యం కుదుట పడేందుకు వైద్య చికిత్సలు అందిస్తున్నారు. కాగా, ఆయన కుటుంబంలోని  ఐదుగురు సభ్యులు సైతం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

కాగా.. ప్రస్తుతం ఆయన పరిస్థితి మరింత విషమించి ఈ రోజు ఉదయం కన్నుమూశారు.

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu