వైరల్ : ఆటో డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్.. ప్రశ్నించినందుకు టూ వీలర్ ని గుద్ది...

Bukka Sumabala   | Asianet News
Published : Dec 25, 2020, 12:39 PM IST
వైరల్ : ఆటో డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్.. ప్రశ్నించినందుకు టూ వీలర్ ని గుద్ది...

సారాంశం

ర్యాష్ గా డ్రైవ్ చేసి టూ వీలర్ ను గుద్దాడో ఆటో డ్రైవర్.. ఇదేంటని అడిగితే నాకే వార్నింగ్ ఇస్తావా అంటూ బీభత్సం సృష్టించాడు. ఈ దారుణ ఘటన ముంబైలోని గోవండి ఏరియాలో జరిగింది. తనకు వార్నింగ్‌ ఇచ్చాడన్న కోపంతో టూ వీలర్‌ మీదికి ఆటోను పోనిచ్చి దౌర్జన్యం చేశాడు. 

ఇదంతా అక్కడి సిగ్నల్ దగ్గరున్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ఈ ఘటన డిసెంబర్‌ 17న జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ' డిసెంబర్‌ 17న గోవండి ఏరియాలో ఆటోడ్రైవర్‌ సయ్యద్‌ సల్మాన్‌ ఆటోని ర్యాష్‌గా నడిపాడు. అదే సమయంలో బైక్‌పై వెళ్తున్న కార్తిక్‌ అనే వ్యక్తికి డాష్‌ ఇచ్చాడు. కానీ దాన్ని పట్టించుకోకుండా సయ్యద్‌ అలాగే ముందుకు వెళ్లిపోయాడు. 

కాగా కొద్దిరూరంలో సిగ్నల్‌ పడడంతో కార్తిక్‌ సయ్యద్‌ సల్మాన్‌ను అడ్డగించి వాదనకు దిగాడు. ఇంత ర్యాష్‌గా నడిపితే ఎలా.. రోడ్డు మీద చూసుకొని వెళితే బాగుంటుదని చెప్పాడు. దీంతో ఆగ్రహించిన సయ్యద్‌ సిగ్నల్‌ రిలీజైన తర్వాత కార్తిక్‌ బైక్‌ను మరోసారి తోసుకుంటూ వెళ్లాడు. 

దీంతో అతను రోడ్డుపైనే కిందపడిపోగా హెల్మెట్‌ ఉండడంతో ప్రాణాపాయం తప్పింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆటో నెంబర్‌ ప్లేట్‌ను గుర్తించి సయ్యద్‌ను అరెస్టు చేశాం. ర్యాష్‌గా డ్రైవింగ్‌ చేయడమే గాక హత్యకు యత్నించిన సయ్యద్‌పై సెక్షన్‌ 307, 279 కింద కేసు నమోదు చేశామని' తెలిపారు

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu